Share News

Delhi: సోరెన్ కేసులో మరో ట్విస్ట్.. సాక్ష్యాలుగా టీవీ, ఫ్రిడ్జ్

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:05 PM

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren) మనీ లాండరింగ్‌ కేసులో ఆదివారం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈడీ దర్యాప్తులో టీవీ, రిఫ్రిజిరేటర్‌లు సాక్ష్యాలుగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

Delhi: సోరెన్ కేసులో మరో ట్విస్ట్.. సాక్ష్యాలుగా టీవీ, ఫ్రిడ్జ్

రాంచీ : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren) మనీ లాండరింగ్‌ కేసులో ఆదివారం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈడీ దర్యాప్తులో టీవీ, రిఫ్రిజిరేటర్‌లు సాక్ష్యాలుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. రూ.31 కోట్ల కంటే ఎక్కువ విలువైన 8.86 ఎకరాల భూమిని సోరెన్ అక్రమంగా సంపాదించారని ఈడీ చేస్తున్న ఆరోపణలను సమర్థించేందుకు కీలకమైన సాక్ష్యాలలో రిఫ్రిజిరేటర్, టీవీ ఇన్‌వాయిస్‌లను స్వీకరించింది.

ఈడీ రాంచీకి చెందిన ఇద్దరు డీలర్ల నుండి ఈ రశీదులను పొందింది. సోరెన్‌తో పాటు మరో నలుగురిపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో వాటిని జత చేసింది. ఈడీ సేకరించిన టీవీ, రిఫ్రిజిరేటర్‌లను సోరెన్ తన కుటుంబసభ్యుడు సంతోష్‌ ముండా పేరుమీద తీసుకున్నట్లు తెలుస్తోంది. సంతోష్‌.. సోరెన్‌ కొనుగోలు చేసిన 8.86 ఎకరాల భూవ్యవహరాలను 14 నుంచి 16 ఏళ్ల నుంచి చూసుకుంటున్నట్లు ఈడీ గుర్తించింది.

మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఆ 8.86 ఎకరాల ల్యాండ్‌కు తనకు సంబంధం లేదని ఈడీ అధికారులతో వాదించారు. అందుకు కౌంటర్‌గా ఈడీ అధికారులు సంతోష్‌ ముండా నుంచి స్టేట్మెంట్‌ రికార్డ్ చేశారు.


అదే కేసులో ఈడీ తొలిసారి 2023 ఆగస్టులో హేమంత్‌‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు జారీ చేసిన వెంటనే రాజ్‌కుమార్‌ పహాన్‌ అనే వ్యక్తి ఆ 8.86 ఎకరాల భూమి తనతోపాటు మరికొందరి ఆధీనంలో ఉందని, ఇతర యజమానుల పేరిట ఉన్న మ్యుటేషన్‌ రద్దు చేయాలని రాంచీ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు.

KTR: జనజాతర కాదు.. హామీల పాతర సభ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీరామారావు

రాజ్‌కుమార్ పహాన్ లేఖను ఈడీ ఖండించింది. సోరెన్‌ తన ఆస్తుల్ని సంరక్షించుకునేందుకు బినామీల పేరిట రాశారని ఆరోపిస్తోంది. సోరెన్‌.. సంతోష్‌ పేరుమీద ఫిబ్రవరి 2017లో రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేశారు. 2022 నవంబర్‌లో ఆయన కుమార్తె పేరు మీద స్మార్ట్ టీవీని రాంచీలో భూమి ఉన్న చిరునామాలో కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సంతోష్‌‌తో పాటు, రాజ్‌కుమార్ సోరెన్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఇదే కేసులో సోరెన్ ను ఈడీ జనవరి 31న అదుపులోకి తీసుకుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 04:05 PM