Share News

Former Minister: అధికార కాంగ్రెస్ నుంచి వికెట్ అవుట్.. బీజేపీలో చేరికకు మాజీమంత్రి నిర్ణయం.. అతిత్వరలోనే కమలం గూటికి..

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:22 PM

రాష్ట్రమాజీ మంత్రి, గౌరిబిదనూరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి ఎన్‌హెచ్‌ శివశంకరరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Former Minister: అధికార కాంగ్రెస్ నుంచి వికెట్ అవుట్.. బీజేపీలో చేరికకు మాజీమంత్రి నిర్ణయం.. అతిత్వరలోనే కమలం గూటికి..

- చిక్కబళ్లాపుర లోక్‌సభ టిక్కెట్‌ కోసం యత్నం

బెంగళూరు: రాష్ట్రమాజీ మంత్రి, గౌరిబిదనూరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి ఎన్‌హెచ్‌ శివశంకరరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిక్కబళ్ళాపుర నుంచి లోక్‌సభ టిక్కెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆయన ఒకవేళ టిక్కెట్‌ లభించకపోతే బీజేపీలో చేరే అవకాశాలే అధికమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజక వర్గం కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం మాజీ ముఖ్యమంత్రి ఎం వీరప్ప మొయిలీతోపాటు యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ రక్షారామయ్య కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. రక్షారామయ్యకు దాదాపుగా టిక్కెట్‌ ఖ రారైనట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల జాబితా విడు దలయ్యాకే శివ శంకరరెడ్డి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. బీజేపీ(BJP) నేతలు ఇప్పటికే శివశంకరరెడ్డితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. గౌరిబిదనూరులో శివశంకర రెడ్డి ప్రత్యర్ధిగా ఉన్న కెహెచ్‌ పుట్టస్వామి ఇటీవల ఒక ప్రకటన విడుదల చేస్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కు మద్దతునివ్వనున్నట్లు ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారి పోతున్నాయి. ఇప్పటికే బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బీఎన్‌ బచ్చే గౌడ కుమారుడు శరత్‌బచ్చేగౌడ కాంగ్రెస్‌లో ఉన్నారు. దరి మిలా లోక్‌సభ ఎన్నికల్లో బచ్చేగౌడ కటుంబంపూర్తిగా కాంగ్రెస్‌వైపు వాలే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చిక్క బళ్ళాపుర లోక్‌సభ టికెట్‌కోసం ఇప్పటికే యలహంక ఎమ్మెల్యే విశ్వనాధ్‌ కుమారుడు అలోక్‌, మాజీ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మాజీ సీఎం యడియూరప్ప కూడా డాక్టర్‌ సుధాకర్‌ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. తాజాగా ఒక వేళ శివశంకర రెడ్డి కూడా ఎంట్రీ ఇస్తే రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

pandu2.2.jpg

Updated Date - Feb 20 , 2024 | 12:22 PM