Share News

Ram Mandir: ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన

ABN , Publish Date - Jan 22 , 2024 | 10:47 AM

అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రామాలయంలో హారతి సందర్భంగా ఆర్మీ హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.

Ram Mandir: ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన

అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే అయోధ్య వీధుల్లో, రోడ్ల మీద రామభక్తులు పెద్ద ఎత్తున చేరి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు రాత్రి నుంచే భక్తుల రాకతో సందడిగా మారాయి. విదేశాల్లో కూడా ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా..అనేక మంది భక్తులు రామనామాలు పఠిస్తున్నారు. అయితే రామాలయంలో హారతి సందర్భంగా ఆర్మీ హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 30 మంది కళాకారులతో భారతీయ సంగీత వాయిద్యాలను మోగించారు.


మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయోధ్యలోని రామాలయంలో జరిగే శ్రీ రాంలాలా మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, మత సంఘాల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అభిజీత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. 121 మంది ఆచార్యులచే క్రతువులు నిర్వహించనున్నారు. గణేశ్వర శాస్త్రి ద్రవిడ ఆచార వ్యవహారాలను పర్యవేక్షించి సమన్వయం చేస్తారు.

గ్రాండ్ రామ్ టెంపుల్ సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించబడింది. దీని పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. దీనికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు సపోర్టుగా ఉన్నాయి. ఆలయ స్తంభాలు, గోడలపై హిందూ దేవుళ్ళ, దేవతల క్లిష్టమైన వర్ణనలు ప్రదర్శింబడ్డాయి. ఆలయ ప్రధాన ద్వారం తూర్పు వైపున ఉంది.

సింగ్ గేట్ ద్వారా 32 మెట్లు ఎక్కడం ద్వారా చేరుకోవచ్చు. ఆలయంలో మొత్తం ఐదు మండపాలు (హాల్స్) ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉంది. ఆలయ సముదాయం నైరుతి భాగంలో, కుబేర్ తిల వద్ద, జటాయువు విగ్రహంతో పాటు, పురాతన శివుని ఆలయం పునరుద్ధరించబడింది.

Updated Date - Jan 22 , 2024 | 11:48 AM