Share News

Farmers Protest: నేడు ఉదయం 11 వరకు కేంద్రానికి డెడ్‌లైన్.. లేదంటే మళ్లీ రైతుల నిరసన

ABN , Publish Date - Feb 21 , 2024 | 06:52 AM

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు బుధవారం రోజు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్రాన్ని హెచ్చరించారు.

Farmers Protest: నేడు ఉదయం 11 వరకు కేంద్రానికి డెడ్‌లైన్.. లేదంటే మళ్లీ రైతుల నిరసన

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు బుధవారం రోజు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటలకు పాదయాత్ర(Farmers Protest) చేస్తామని రైతులు కేంద్రాన్ని హెచ్చరించారు. ఉదయం 11 లోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి(Delhi) బయలుదేరుతామని రైతు నేతలు చెప్పారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సింగూ సరిహద్దుల్లోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు ఐదు వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, GT రోడ్‌, సోనిపట్‌, ఢిల్లీలోని సింగు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్‌లను బద్దలు కొట్టడానికి శంభు సరిహద్దు వద్ద పోక్‌లేన్, హైడ్రా, JCBలను కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: స్విస్‌ను మరిపించేలా కశ్మీరు!


మరోవైపు హర్యానా ప్రభుత్వం(haryana government) 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సస్పెన్షన్‌ ఫిబ్రవరి 21 వరకు ఇప్పటికే పొడిగించింది. 177 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ లింక్‌లను ప్రభుత్వం తాత్కాలికంగా బ్లాక్ చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగోదశ చర్చల్లో ఐదు పంటల ఎంఎస్‌పీ(MSP)పై కేంద్రం ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధర (MSP) చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 'ఢిల్లీ చలో' ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 11 లోపు కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

మరోవైపు రైతులకు ఎంఎస్‌పీ అంశంపై చట్టపరమైన హామీ ఇవ్వడంపై రాహుల్ గాంధీ(rahul gandhi) మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులకు హామీ ఇస్తే దేశ జీడీపీ వృద్ధికి తోడ్పాటునిస్తుందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రైతుల కోసం ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.

Updated Date - Feb 21 , 2024 | 06:53 AM