Share News

Election Commission of India: అమిత్‌ షాపై ఆరోపణలకు ఆధారాలు చూపండి

ABN , Publish Date - Jun 04 , 2024 | 02:55 AM

కేంద్ర మంత్రి అమిత్‌ షాపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. చివరి దశ ఎన్నికలు ముగిశాక..

Election Commission of India: అమిత్‌ షాపై ఆరోపణలకు ఆధారాలు చూపండి

కేంద్ర మంత్రి అమిత్‌ షాపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. చివరి దశ ఎన్నికలు ముగిశాక.. జిల్లా కలెక్టర్లకు అమిత్‌ షా ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని జైరాం రమేశ్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆ ఆరోపణలకు సోమవారం రాత్రి 7 గంటలలోగా ఆధారాలు చూపాలని జైరాం రమేశ్‌ను ఆదేశించింది. లేనిపక్షంలో వాటిని నిరాధార ఆరోపణలుగా భావించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నట్టుగా.. బెదిరింపులకు సంబంధించి తమకు ఏ జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచిగానీ, ఇతర అధికారుల నుంచిగానీ ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని కమిషన్‌ స్పష్టం చేసింది.

Updated Date - Jun 04 , 2024 | 02:55 AM