Share News

Airports: ప్రపంచంలో రద్దీగా ఉండే పది ఎయిర్ పోర్టులు ఇవే..? ఢిల్లీ స్థానం ఎంతంటే..?

ABN , Publish Date - Apr 15 , 2024 | 09:52 PM

ప్రపంచంలో రద్దీగా ఉండే పది విమానాశ్రయాల జాబితాను ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. అందులో దేశ రాజధాని ఢిల్లీలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు లభించింది.

Airports: ప్రపంచంలో రద్దీగా ఉండే పది ఎయిర్ పోర్టులు ఇవే..? ఢిల్లీ స్థానం ఎంతంటే..?
Delhi IGI Airport Features Amongst Top 10 busiest Airports In World

ఢిల్లీ: ప్రపంచంలో రద్దీగా ఉండే పది విమానాశ్రయాల జాబితాను ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) విడుదల చేసింది. అందులో దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చోటు లభించింది. జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో అమెరికాలో గల అట్లాంటా ఎయిర్ పోర్టు నిలిచింది. దుబాయ్, డల్లాస్/ పోర్ట్ వర్త్, లండన్, యుకే, టోక్యో, జపాన్, డెన్వార్ అమెరికా, ఇస్తాంబుల్- టర్కీ, లాస్ ఏంజెల్స్, చికాగో వరసగా ఉన్నాయి. రద్దీగా ఉండే జాబితాలో పదో స్థానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు నిలిచింది.

Narendra Modi: ఈడీ దాడులు, ఎలక్టోరల్ బాండ్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు


2023లో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు 7.22 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారని వివరించింది. 2022లో మాత్రం రద్దీగా ఉండే జాబితో తొమ్మిదో స్థానంలో నిలువడం విశేషం. 2019లో మాత్రం 17వ స్థానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు ఉంది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చిన వారి జాబితా ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. అట్లాంటా ఎయిర్ పోర్టుకు 10.46 కోట్ల మంది ప్రయాణికులు ట్రావెల్ చేశారని వివరించింది. ఆ తర్వాత దుబాయ్ ఎయిర్ పోర్టుకు 8.6 కోట్ల మంది ప్రయాణించారని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 09:52 PM