Share News

CPI Leader: ప్రధాని మోదీ మళ్ళీ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు రావాలి!

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:05 PM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఇండియా కూటమి బలం మరింత పెరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ మరిన్నిసార్లు రాష్ట్ర పర్యటనకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌(CPI State Secretary Muttharasan) కోరారు.

CPI Leader: ప్రధాని మోదీ మళ్ళీ మళ్ళీ రాష్ట్ర పర్యటనకు రావాలి!

- సీపీఐ నేత ముత్తరసన్‌

చెన్నై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఇండియా కూటమి బలం మరింత పెరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ మరిన్నిసార్లు రాష్ట్ర పర్యటనకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌(CPI State Secretary Muttharasan) కోరారు. తంజావూరు లోక్‌సభ డీఎంకే అభ్యర్థి తంజై అబ్రహాంకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడులో ఇండియా కూటమి బలం మరింత పెరగాలంటే ప్రధాని మోదీ మరిన్ని సార్లు రాష్ట్రానికి రావాలని ఆయన కోరారు. కేంద్రంలో పదేళ్ళుగా ప్రధాని మోదీ అధికారంలో ఉన్నారని, ఆయన కచ్చాదీవిని స్వాధీనం చేసుకోలేకపోయారన్నారు. ఇపుడు మాత్రం కచ్చాదీవు సమస్యను వివాదాస్పదంగా మార్చేశారన్నారు. హిట్లర్‌కు, నరేంద్ర మోదీకి ఏమాత్రం తేడా లేదన్నారు. దేశంలో విపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉండరాదని కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి కృషి చేస్తుందన్నారు. ఇండియా కూటమి సీట్ల కోసం పొత్తుపెట్టుకోలేదని, సిద్ధాంతం కోసం ఒకటిగా ఏర్పడటం జరిగిందన్నారు. అంతేకాకుండా, మతసామరస్య పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. ఈ ఎన్నికలు ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగే పోరు కాదని, సర్వాధికారి, ఫాసి్‌స్టకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం కాదని ఆయన పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Kamal Haasan: మంచివాళ్ల కోసమే నేను ప్రచారం చేస్తున్నా!

Updated Date - Apr 12 , 2024 | 12:06 PM