Share News

Rajastan: భారత్‌ను కాంగ్రెస్ ఎన్నడూ బలోపేతం చేయదు.. ప్రధాని మోదీ ధ్వజం

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:29 PM

యూపీఏ అధికారంలో ఉన్నన్నినాళ్లూ దేశం దివాలా తీసిందని.. ఆ పార్టీ భారత్‌ను ఎన్నడూ బలోపేతం చేయలేదని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

Rajastan: భారత్‌ను కాంగ్రెస్ ఎన్నడూ బలోపేతం చేయదు.. ప్రధాని మోదీ ధ్వజం

జైపూర్: యూపీఏ అధికారంలో ఉన్నన్నినాళ్లూ దేశం దివాలా తీసిందని.. ఆ పార్టీ భారత్‌ను ఎన్నడూ బలోపేతం చేయలేదని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు.

రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. 2014కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలని దేశం కోరుకోవడం లేదన్నారు.


"బంధుప్రీతి, అవినీతితో చెదలు పట్టి దేశాన్ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్‌కు దేశ ప్రజలు శిక్ష విధిస్తున్నారు. ప్రస్తుత ఆ పార్టీ దుస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణం. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు కనీసం 300 సీట్లలో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టలేకపోతోంది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పంపారు. కానీ ఆయన్ను మళ్లీ రాష్ట్రంలో చూశారా? ఆ పార్టీ నుంచి మరో నేత ఇప్పుడు రాజ్యసభకు వెళ్లారు.

ఎన్నికల్లో పోరాడి గెలవలేని వారు రాజ్యసభకు వచ్చారు. దేశంలోని ప్రతి ఇంటికి తాగు నీరు, రైతులకు సాగు నీరు చేరేలా చూడటం నా లక్ష్యం. గత 5 సంవత్సరాలలో జల్ జీవన్ మిషన్ కింద 11 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ది పొందాయి. దురదృష్టవశాత్తు రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కూడా అవినీతి చేసింది. సీఎం భజన్‌లాల్ నేతృత్వంలో 'హర్ ఘర్ జల్' పథకం కింద అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం”అని మోదీ అన్నారు. రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 12 స్థానాలకు మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగ్గా, మిగిలిన 13 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడత పోలింగ్ జరగనుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 04:29 PM