Lok Sabha polls: ఐదుగురితో కాంగ్రెస్ 9వ జాబితా.. సీనియర్లకు షాక్!
ABN , Publish Date - Mar 30 , 2024 | 08:31 AM
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో 9వ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో కర్ణాటక నుంచి ముగ్గురు, రాజస్థాన్ నుంచి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. అయితే రాజస్థాన్‌లోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది.
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో 9వ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో కర్ణాటక నుంచి ముగ్గురు, రాజస్థాన్ నుంచి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. అయితే రాజస్థాన్‌లోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. గతంలో ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. తాజా జాబితాలో అభ్యర్థులను మార్చింది. రాజస్థాన్‌లోని భిల్వారా నుంచి సీపీ జోషికి టిక్కెట్టు కేటాయించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి డాక్టర్ దామోదర్ గర్జర్ను అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా డాక్టర్ దామోదర్ గర్జర్కు రాజ్‌సమంద్ టికెట్ కేటాయించింది. ఈ సీటును గతంలో సుదర్శన్ రావత్‌కు కేటాయించగా.. ఆయనను తప్పించి దామోదర్ గర్జర్ను ఎంపిక చేసింది.
సీనియర్లకు షాక్..
కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎస్టీ ఈ తుకారాంను, చామరాజనగర్ నుంచి సునీల్ బోస్, చిక్కబళ్లాపూర్ నుంచి రక్షా రామయ్యను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీకి కాంగ్రెస్ టికెట్ నిరాకరించింది. వయస్సు రీత్యా ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వన్నట్లు తెలుస్తోంది. చిక్కబళ్లాపూర్ నుంచి వీరప్పమొయిలీ రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి రక్షా రామయ్యను కాంగ్రెస్ ఎంపిక చేసింది.
మొత్తం 213 మంది..
లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటివరకు 213 మంది అభ్యర్థులను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత , మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్4న ఓట్ల లెక్కింపు చేపడతారు. 543 లోక్‌సభ స్థానాల్లో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యేది అప్పుడే.. వాటిపైనే ప్రధాన దృష్టి..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..