CM Siddaramaiah: సంబరాల సభ.. హాసన్‌లో నిర్వహణకు సీఎం కసరత్తు
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:02 PM
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ‘ముడా’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఓటమితో ఖంగు తిన్న తరుణంలోనే బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.

- 2 లక్షల మందిని సమీకరించే యత్నం
- దేవెగౌడపై పంతం కోసమే
బెంగళూరు: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ‘ముడా’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఓటమితో ఖంగు తిన్న తరుణంలోనే బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో చన్నపట్టణలో నిఖిల్ ఓటమి అధికార కాంగ్రెస్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. చన్నపట్టణ ఎన్నిక ఓ విధంగా మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం సిద్దరామయ్యల మధ్య సమరం అనిపించేలా సాగింది.
ఈ వార్తను కూడా చదవండి: Nikhil: ఓడిపోవడం బాధే.. అలాగని కుంగిపోయేది లేదు
సిద్దరామయ్య ప్రభుత్వం కూలేంతవరకు విశ్రమించేది లేదని దేవెగౌడ శపథం బూని ప్రచారం చేశారు. ఎన్నికల్లో సిద్దరామయ్య కూడా ధీటుగానే పర్యటించి సవాళ్లు విసిరారు. దేవెగౌడ ఒక్కలిగలలో ఒకరికి కూడా ఎదగనివ్వలేదన్నారు. తాను బీసీ అనే కారణంతో వ్యతిరేకిస్తారన్నారు. కానీ వైకే రామయ్య, నాగేగౌడ, బచ్చేగౌడ, వరదేగౌడ, పుట్టణ్ణ, చలువరాయస్వామి, బాలకృష్ణ, బైరేగౌడ, కేఆర్ పేట చంద్రశేఖర్ వంటి ఎంతోమందిని ఎదగనివ్వకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు.
డీకే శివకుమార్, డీకే సురేశ్‌లను ముగించాలని ప్రస్తుతం కంకణం కట్టుకున్నారన్నారు. తాను జీటీ దేవేగౌడకు ముందుగానే హెచ్చరించానని లేదంటే ముగిస్తారని హెచ్చరించానన్నారు. కొడుకులాంటివారని చెప్పుకొంటూనే బీఎల్ శంకర్, వైకే రామయ్యలను ముగించారని ప్రచారం చేశారన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలతో జేడీఎస్ పార్టీకి రామనగరలో ఉనికి లేకుండా పోయింది. హాసన్(Hasan)లోనూ ఎంపీ సీటు కోల్పోవడంతో భారీ దెబ్బ పడింది.
ఇటువంటి తరుణంలోనే దేవెగౌడ కంచుకోటగా ఉండే హాసన్‌లో భారీ సమావేశం నిర్వహించేందుకు సీఎం సిద్దరామయ్య కసరత్తు చేస్తున్నారు. మండ్య, మైసూరులనుంచే కనీసం 2లక్షలమందిని సమీకరించే ఆలోచనలో ఉన్నారు. భారీ సమావేశం ద్వారా సిద్దరామయ్య తన ప్రతిష్టను పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు ఆప్తులుగా ముద్రపడిన మంత్రులు మహదేవప్ప, రాజణ్ణలను రంగంలోకి దింపారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News