Share News

Chennai: తప్పిన ఘోర ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు

ABN , Publish Date - May 21 , 2024 | 11:41 AM

చెంగల్పట్టు జిల్లా మరమలైనగర్‌ సమీపంలో ఒకే ట్రాక్‌పై నాలుగు సబర్బన్‌ రైళ్లు(Four suburban trains) ఒకదాని వెనుక ఒకటి అతి దగ్గరగా ఆగిన సంఘటన కలకలం రేపింది. సాంకేతికలోపం కారణంగా సిగ్నల్‌ పనిచేయకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని రైల్వే భద్రతా విభాగం అధికారులు తెలిపారు.

Chennai: తప్పిన ఘోర ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు

- మరమలైనగర్‌ సమీపంలో సిగ్నల్‌ లోపం

చెన్నై: చెంగల్పట్టు జిల్లా మరమలైనగర్‌ సమీపంలో ఒకే ట్రాక్‌పై నాలుగు సబర్బన్‌ రైళ్లు(Four suburban trains) ఒకదాని వెనుక ఒకటి అతి దగ్గరగా ఆగిన సంఘటన కలకలం రేపింది. సాంకేతికలోపం కారణంగా సిగ్నల్‌ పనిచేయకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని రైల్వే భద్రతా విభాగం అధికారులు తెలిపారు. రాజధాని నగరం చెన్నై(Chennai) నుంచి పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌(Chengalpattu, Kanchipuram, Thiruvallur) జిల్లాలకు ప్రతిరోజు నడుపుతున్న సబర్బన్‌ రైళ్లలో వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు. చెన్నై బీచ్‌-తాంబరం-చెంగల్పట్టు మధ్య నాలుగు రైలు మార్గాలున్నాయి. వీటిలో రెండు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మిగతా రెండు మార్గాల్లో సబర్బన్‌ రైళ్లు నడుపుతున్నారు.

ఇదికూడా చదవండి: Rains: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు వర్షాలు.. మరోవైపు ఎండలు కూడా


ఈ నేపథ్యంలో, తాంబరం నుంచి చెంగల్పట్టు వరకు ఇటీవల మూడో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, సబర్బన్‌ రైళ్లను ఒకే సమయంలో నడపడం వల్ల తరచూ ఆ మార్గంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం మరమలైనగర్‌-సింగపెరుమాళ్‌కోయిల్‌ ప్రాంతంలో ఒకే ట్రాక్‌పై నాలుగు సబర్బన్‌ రైళ్లు ఒకదాని వెనుక ఒకటి అతిదగ్గరగా ఆగాయి. ఒకవేళ చివరగా ఆగిన రైలు వేగంగా ఆ ట్రాక్‌పై వచ్చి ఉంటే ముందున్న రైళ్లను ఢీకొనేందుకు అవకాశముండేదని, అయితే రైలింజన్‌ డ్రైవర్ల చాకచక్యం వల్ల చెంగల్పట్టు నుంచి చెన్నై బీచ్‌కు బయల్దేరిన నాలుగు రైళ్లు ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సిగ్నల్‌కు మరమ్మతులు చేపట్టిన అనంతరం ఆ మార్గంలో సుమారు 40 నిమిషాల అనంతరం సబర్బన్‌ రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగాయి.

nani1.2.jpg


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 21 , 2024 | 11:41 AM