Share News

Court: భార్యను దెయ్యం, పిశాచి అని పిలవడం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:29 PM

సాధారణంగా కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడప్పుడు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా అలాంటి తీర్పే పట్నా హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు సారాంశం ప్రకారం.. భార్యను.. భర్త దెయ్యం, పిశాచం అని పిలవడం నేరం కాబోదు. అలా పిలవడం క్రూరత్వం కిందకు రాదని పట్నా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Court: భార్యను దెయ్యం, పిశాచి అని పిలవడం క్రూరత్వం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు

భార్యభర్తలన్నాక.. కసుబుస్సులు సాధారణమే. ఇవాళ తిట్టుకుంటారు.. రేపు కలిసిపోతారు. కొందరు భర్తలు తమ భార్యలను అప్పుడప్పుడు దెయ్యం, భూతం అని సంబోధిస్తుంటారు. తిట్లను భార్య లైట్ తీసుకుంటే ఫర్వాలేదు. కానీ అలా తిట్టాడని కోర్టు మెట్లెక్కితే.. ఇలాంటి ఘటనే పట్నా హైకోర్టులో జరిగింది. కానీ ఇక్కడే భార్యకు ఓ ట్విస్ట్ ఇచ్చింది కోర్టు.

పట్నా: కోర్టు తీర్పు సారాంశం ప్రకారం.. భార్యను.. భర్త దెయ్యం, పిశాచం అని పిలవడం నేరం కాబోదు. అలా పిలవడం క్రూరత్వం కిందకు రాదని పట్నా హైకోర్టు(Patna High Court) సంచలన తీర్పునిచ్చింది. జార్ఖండ్ రాష్ట్రం బొకారోకి చెందిన సహదేవ్ గుప్తా కుమారుడు నరేష్ కుమార్ గుప్తా.

నరేష్ గుప్తాకు నవాడాకి చెందిన మహిళతో రెండు దశాబ్దాల క్రితం వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంతో నరేష్ గుప్తా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆమె తన స్వస్థలమైన నవాడాలో తనను అత్తమామ, భర్తలు వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బిహార్‌ రాష్ట్రం నలంద జిల్లాలోని కోర్టు తండ్రీ కొడుకులకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను సవాలు చేస్తూ నరేష్ గుప్తా.. పట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Lok Sabha Elections: జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..

2008లో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ద్వారా భార్యపై వేధింపుల ఆరోపణలతో తండ్రి కొడుకులు ఏడాదిపాటు కారాగార శిక్ష అనుభవించారు. అనంతరం కేసు నవాడా నుంచి నలందకు బదిలీ చేశారు.


అప్పటికే నరేష్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా 10 సంవత్సరాల తరువాత 2018లో విడాకులు మంజూరయ్యాయి. పట్నా హైకోర్టులో నరేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. విడాకులు తీసుకున్న మహిళ తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ.. బాధితురాలిని ఆమె అత్తమామలు, భర్త "భూత్", "పిశాచ్" అని పిలిచేవారని.. ఈ పిలుపు క్రూరత్వంతో సమానమని వాదించింది. అయితే కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది.

వైవాహిక బంధాలలో భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు దుర్భాషలాడుతూ, అసభ్యకరమైన భాషలో మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయని.. అలా చేయడం క్రూరత్వం కిందకి రాదని కోర్టు స్పష్టం చేసింది. ఆమెను వేధించి, హింసించినందుకే కోర్టులు శిక్షవిధించాయని వెల్లడించింది. పట్నా సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ వివేక్ చౌధురి కీలకమైన ఈ తీర్పు వెలువరించారు. ఈ తీర్పు సంచలనం సృష్టిస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 06:00 PM