Share News

IISC: కేంద్రీయ విద్యాలయంలో బాంబ్?..రంగంలోకి అధికారులు

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:58 AM

కర్ణాటక బెంగళూరు(bangalore)లోని కేంద్రీయ విద్యాలయం IISCకి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

IISC: కేంద్రీయ విద్యాలయంలో బాంబ్?..రంగంలోకి అధికారులు

కర్ణాటక బెంగళూరు(bangalore)లోని కేంద్రీయ విద్యాలయం IISCకి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇమెయిల్ సమాచారంలో పాఠశాల ఆవరణలో బాంబును అమర్చినట్లు పేర్కొన్నారు. అది ఉదయం 10:20 గంటలకు పేలుతుందని తెలిపారు. ఆ క్రమంలో పోలీసులు మొత్తం ప్రాంగణాన్ని చుట్టుముట్టి బాంబు కోసం వెతుకుతున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Business Idea: కేవలం రెండు లక్షలతో బిజినెస్..ఏటా రూ.28 లక్షలకుపైగా ఆదాయం!


పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు బెదిరింపు ఇమెయిల్ మూలాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ అమృతబాల, విద్యార్థులు సహా సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ KV బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క్యాంపస్‌లో ఉన్న IHL సెక్టార్ కిందకు వస్తుంది. ఇది బెంగళూరు నగరం నడిబొడ్డున (యశ్వంత్‌పూర్ సర్కిల్ సమీపంలో) ఉంది. నగరం నడిబొడ్డున ఇది ఉండటంతో ఈ వ్యవహారంపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఈ కేంద్రీయ విద్యాలయం IISc బెంగళూరు 1978లో స్థాపించబడింది. ఇది CBSEకి అనుబంధంగా ఉన్న సహ విద్యా సంస్థ, కేంద్రీయ విద్యాలయ సంగతన్, న్యూఢిల్లీ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది మానవ వనరులు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది.

Updated Date - Feb 04 , 2024 | 11:58 AM