Share News

BJP-BJD Alliance: బీజేపీ-బీజేడీ పొత్తు దాదాపు ఖాయం.. ఎవరెవరికీ ఎన్ని సీట్లు?

ABN , Publish Date - Mar 07 , 2024 | 12:36 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు BJP నేతృత్వంలోని NDA తన సీట్లను పెంచుకునే పనిలో భాగంగా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఒడిశాలో అధికార బీజేడీ బీజేపీతో తిరిగి పొత్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

BJP-BJD Alliance: బీజేపీ-బీజేడీ పొత్తు దాదాపు ఖాయం.. ఎవరెవరికీ ఎన్ని సీట్లు?

లోక్‌సభ ఎన్నికలకు(lok sabha elections 2024) ముందు BJP నేతృత్వంలోని NDA తన సీట్లను పెంచుకునే పనిలో భాగంగా బిజీగా ఉంది. యూపీ తర్వాత ఇప్పుడు ఒడిశాలో కూడా కొత్త పార్టీ ఎన్డీయేలోకి రానుంది. లోక్‌సభ ఎన్నికలు, ఒడిశాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ, బిజూ జనతాదళ్ (BJP) మధ్య పొత్తు కుదిరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బీజేడీ, బీజేపీల మధ్య ఎన్నికలకు ముందు పొత్తుపై అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ, రెండు పార్టీల నేతలు ముందస్తు ఎన్నికల పొత్తుపై సూచనలిచ్చారు.

బుధవారం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(naveen patnaik) నివాసంలో BJD నాయకులు మారథాన్ సమావేశాన్ని నిర్వహించగా, దేశ రాజధానిలో బీజేపీ నాయకులు ఇదే విధమైన సమావేశాన్ని చేపట్టారు. ఇందులో పొత్తుతో సహా ఎన్నికల విషయాలు చర్చించబడ్డాయి. మూడు గంటల చర్చ తర్వాత, BJD ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా బీజేపీతో పొత్తు గురించి చర్చలను అంగీకరించారు. అయితే దాని ఏర్పాటును స్పష్టంగా ధృవీకరించలేదు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Congress: లోక్‌సభ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాలపైనే కాంగ్రెస్ ఫోకస్!


అదే సమయంలో, BJD ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సాహు మాట్లాడుతూ, 'BJD సీనియర్ నాయకులు చాలా మంది రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అనేక విషయాలు చర్చించారు. అనంతరం సీఎం, పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌తోనూ చర్చించారు. బీజేడీ ఎప్పుడూ ఒడిశా(odisha) ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తుంది. ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, BJD చర్యలు తీసుకుంటుందని అన్నారు.

పొత్తుల ఊహాగానాల మధ్య ఒడిశా యూనిట్ నేతలు శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda)తో సమావేశమయ్యారు. బీజేపీ, బీజేడీల మధ్య పొత్తుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, అయితే దీనిపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఇది వివిధ అంశాలపై, ముఖ్యంగా సీట్ల పంపకంపై ఆధారపడి ఉంటుందని ఆయా వర్గాలు తెలిపాయి.


పొత్తు కుదిరితే రాష్ట్రంలోని చాలా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ(BJP) పోటీ చేయనుంది. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాయి. అసెంబ్లీలో బీజేడీ 112, బీజేపీ 23 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 9 ఎంపీ సీట్లు, 55 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేడీ చూస్తున్నట్లు తెలిసింది. సీట్ల పంపకం చర్చలు విఫలమవడంతో 11 ఏళ్ల రాజకీయ భాగస్వామ్యం తర్వాత 2009లో బీజేడీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది.

Updated Date - Mar 07 , 2024 | 12:36 PM