Share News

Politics: బీజేపీ Vs కాంగ్రెస్.. చిచ్చు రేపిన రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన

ABN , Publish Date - Jan 10 , 2024 | 04:15 PM

గణతంత్ర దినోత్సవ పరేడ్(Republic Day Parade) సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించే శకటాల ప్రదర్శన బెంగళూరు(Bengaluru)లో అధికార విపక్షల మధ్య మాటల మంటలు రాజేస్తోంది.

Politics: బీజేపీ Vs కాంగ్రెస్.. చిచ్చు రేపిన రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన

బెంగళూరు: గణతంత్ర దినోత్సవ పరేడ్(Republic Day Parade) సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించే శకటాల ప్రదర్శన బెంగళూరు(Bengaluru)లో అధికార విపక్షల మధ్య మాటల మంటలు రాజేస్తోంది. కర్ణాటక(Karnataka) శకట ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందంటూ సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) చేసిన ఆరోపణలపై బీజేపీ(BJP) నేతలు మండిపడుతున్నారు. సిద్ధూ మాటలపై స్పందించిన ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర సర్కారుపై మండిపడ్డారు.

ఆయన మాట్లాడుతూ "శకటం నిరాకరించడానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించాల్సింది. సమస్యను రాజకీయం చేయడం మానుకోవాలి. వరుసగా 14సార్లు కర్ణాటక శకటాలు ప్రదర్శించాం. ఇతర రాష్ట్రాలకు అవకాశం ఇచ్చేందుకు ఈ సారి కర్ణాటకకు అవకాశం నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రతి రాష్ట్రం తమ రాష్ట్ర శకటం ప్రదర్శనలో ఉండాలని కోరుకుంటాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సార్లు అవకాశం రాలేదు. వెంటనే కేంద్రంతో చర్చిస్తే అనుమతి లభించింది. కాంగ్రెస్ సర్కార్ కూడా కేంద్రాన్ని సంప్రదించి ఉంటే బాగుండేది" అని అన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో కర్ణాటకకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అనుమతి నిరాకరించడంతో కేంద్ర ప్రభుత్వం 7 కోట్ల మంది కన్నడిగులను అవమానించిందని సిద్ధరామయ్య మంగళవారం ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతోనే రాష్ట్రంపై బీజేపీ వివక్ష చూపిస్తోందని అన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 04:15 PM