Share News

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చినా.. బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా..?

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:16 AM

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. అధికారం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి. వరుసగా మూడోసారి విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు డూ ఆర్ డైలా మారాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు..

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చినా.. బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా..?

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. అధికారం కోసం ఎన్డీయే, ఇండియా కూటమి పోటీపడుతున్నాయి. వరుసగా మూడోసారి విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు డూ ఆర్ డైలా మారాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు.. 400 సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మరోవైపు ఓట్ల శాతాన్ని 50 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 400 సీట్లు వచ్చినా బీజేపీ 50 శాతం ఓట్లను సాధించగలదా అనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 400 సీట్లు ఒక పార్టీ సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం గతంలో కాంగ్రెస్‌కు పోటీగా ఇతర పార్టీలు అంతగా ప్రభావం చూపించకపోవడంతో ఆ పార్టీ ఎక్కువ సీట్లతో అధికారాన్ని చేపట్టగలిగింది. అయితే దేశంలో 400కు పైగా సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఎప్పుడూ 50 శాతం ఓట్లు సాధించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తన లక్ష్యాన్ని ఎలా చేరుకోగలదా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.

Elections 2024: ఆర్థిక మంత్రులు లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

17సార్లు ఎన్నికలు..

స్వతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగాయి. 10 సార్లు మాత్రమే పూర్తి మెజారిటీతో ఒకే పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. కాంగ్రెస్‌ ఏడుసార్లు, బీజేపీ రెండుసార్లు, జనతా పార్టీ ఒకసారి పూర్తిస్థాయి మెజార్టీ సీట్లు గెలుపొందాయి. 7 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దేశంలో ఇప్పటి వరకు అత్యధిక సీట్లు, ఓట్లు 1984లో కాంగ్రెస్ పార్టీ సాధించింది.

50 శాతం దాటని మెజార్టీ

స్వాతంత్య్రానంతరం తొలిసారిగా 1951-52లో దేశంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 45 శాతం ఓట్లతో 364 సీట్లు గెలుచుకుంది. 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 47.8 శాతం ఓట్లతో 371 సీట్లు, 1962 లోక్‌సభ ఎన్నికల్లో 44.7 శాతం ఓట్లతో 361 సీట్లను కాంగ్రెస్ గెలుపొందింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో 43.7 శాతం ఓట్లతో 352 సీట్లు గెలుపొందింది. 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ 41.3 శాతం ఓట్లతో 295 సీట్లలో గెలిపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 42.7 శాతం ఓట్లతో 353 సీట్లు గెలుచుకుంది. ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 48.1 శాతం ఓట్లతో 415 సీట్లు గెలుచుకోగలిగింది. 415 సీట్లను గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 50 శాతం దాటలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరిగినప్పటికీ.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 31.4 శాతం ఓట్లతో 282 సీట్లు గెలుచుకోగలిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 37.76 శాతం ఓట్లతో 303 సీట్లు గెలుచుకుంది.

ఇందిరా హత్య తర్వాత..

ఇందిరా గాంధీ హత్య తర్వాత దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 48.1 శాతం ఓట్లతో 415 సీట్లు గెలుచుకోగలిగింది, ఇది ఇప్పటి వరకు అతిపెద్ద రికార్డు. కాంగ్రెస్‌ 7 సార్లు పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఒక్కసారి కూడా 50 శాతం ఓట్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం బీజేపీ మాత్రం 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే కాకుండా 50 శాతం ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా..

2024 ఎన్నికల్లో తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. 50 శాతం ఓట్లు దాటాలంటే బీజేపీకి 2019 కంటే 12 శాతం అధికంగా ఓట్లు రావాలి. దీనికోసం ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు చిన్న పార్టీలతో బీజేపీ చేతులు కలిపింది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది జూన్4న తేలిపోనుంది.

Sumalatha: ఇంకా టిక్కెట్ ఇవ్వలేదు.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా.. సుమలత కామెంట్స్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 10:17 AM