Share News

Parliament session 2024: ఉభయసభల ఎంపీలకు బీజేపీ మూడులైన్ల విప్

ABN , Publish Date - Feb 09 , 2024 | 06:58 PM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బీజేపీ శుక్రవారంనాడు విప్ జారీ చేసింది. పార్లమెంటులో కీలక అంశాలపై చర్చ ఉన్నందున 10వ తేదీన ఎంపీలంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరుకావాలంటూ మూడు లైన్ల విప్‌లో కోరింది.

Parliament session 2024: ఉభయసభల ఎంపీలకు బీజేపీ మూడులైన్ల విప్

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament session 2024) శనివారంతో ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బీజేపీ (BJP) శుక్రవారంనాడు విప్ (whip) జారీ చేసింది. పార్లమెంటులో కీలక అంశాలపై (Legislative business) చర్చ ఉన్నందున 10వ తేదీన ఎంపీలంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరుకావాలంటూ మూడు లైన్ల విప్‌లో కోరింది.


''ఫిబ్రవరి 10వ తేదీన లోక్‌సభ, రాజ్యసభలో కొన్ని కీలక అంశాలను చర్చకు తెచ్చి, వాటిని ఆమోదించడం జరుగుతుంది. ఈ విషయాన్ని పార్టీ ఎంపీలందరికీ తెలియజేస్తున్నాం. ఉభయసభల సభ్యులు తప్పని సరిగా హాజరై ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నాం'' అని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు వేర్వేరుగా జారీ చేసిన విప్‌లో ఆ పార్టీ పేర్కొంది.


కాగా, ఇప్పటికే సుమారు 60 పేజీల శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టారు. 2004 నుంచి యూపీఏ ప్రభుత్వం సంస్కరణలు గాలికి వదిలేసిందని, దేశ పటిష్ఠత కోసం గత బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వేసిన కృషిని కొనసాగించడంలో విఫలమైందని ఆ శ్వేతపత్రంలో తప్పుపట్టింది. రక్షణరంగంలో కుంభకోణాలు చోటుచేసుకున్నాయని, రక్షణ సన్నద్ధతపై రాజీపడ్డారని, ఆయుధాల సేకరణలో జాప్యం జరిగిందని యూపీఏ పాలనను ఎండగట్టింది. బొగ్గు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ పక్షపాతవైఖరితో కోల్ బ్లాక్‌ కేటాయింపులు జరిగాయని శ్వేతపత్రం ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 9వ తేదీతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉండగా, ఒకరోజు అదనంగా (10వ తేదీ వరకూ) సమావేశాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పొడిగించింది.

Updated Date - Feb 09 , 2024 | 06:58 PM