Share News

BJP: బీజేపీ జిల్లా కమిటీల ఎంపికలో.. ‘అప్ప’ వర్గీయులకే అగ్రస్థానం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:46 PM

బీజేపీ జిల్లా కమిటీల ఎంపికలో అప్ప వర్గీయులకే అగ్రస్థానం దక్కింది. రాష్ట్రంలోని మొత్తం 39 రాజకీయ జిల్లాల పార్టీ అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. భోగి పండుగ రోజే ఈ జాబితాను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విడుదల చేశారు.

BJP: బీజేపీ జిల్లా కమిటీల ఎంపికలో.. ‘అప్ప’ వర్గీయులకే అగ్రస్థానం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బీజేపీ జిల్లా కమిటీల ఎంపికలో అప్ప వర్గీయులకే అగ్రస్థానం దక్కింది. రాష్ట్రంలోని మొత్తం 39 రాజకీయ జిల్లాల పార్టీ అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. భోగి పండుగ రోజే ఈ జాబితాను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విడుదల చేశారు. ఈ జాబితాలో పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప(Former Chief Minister BS Yeddyurappa) మద్దతుదార్లకే పెద్దపీట వేయడం విశేషం. బెంగళూరు ఉత్తర జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌. హరీష్‌, బెంగళూరు సెంట్రల్‌ అధ్యక్షుడిగా సప్తగిరిగౌడ, బెంగళూరు దక్షిణ అధ్యక్షుడిగా జయనగర్‌ ఎమ్మెల్యే సీకే రామమూర్తిని నియమించారు. ఇక కోలారు జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్‌ కేఎన్‌ వేణుగోపాల్‌, చిక్కబళ్లాపురం అధ్యక్షుడిగా రామలింగప్ప, బెంగళూరు గ్రామీణ అధ్యక్షుడిగా రామకృష్ణప్ప నియమితులయ్యారు. రాయచూరు అధ్యక్షుడిగా డాక్టర్‌ శివరాజ్‌ పాటిల్‌, కొప్పళ అధ్యక్షుడిగా నవీన్‌ గుళగణ్ణనవర్‌, బళ్లారి అధ్యక్షుడిగా అనిల్‌ కుమార్‌ మోకా, విజయనగర అధ్యక్షుడిగా చెన్న బసవనగౌడ పాటిల్‌, దావణగెరె అధ్యక్షుడిగా రాజశేఖర్‌, చిత్రదుర్గ అధ్యక్షుడిగా ఎ.మురళి, తుమకూరు అధ్యక్షుడిగా రవిశంకర్‌, మధుగిరి అధ్యక్షుడిగా బీసీ హనుమంతెగౌడ, మైసూరు నగర అధ్యక్షుడిగా ఎల్‌.నాగేంద్ర, మైసూరు రూరల్‌ అధ్యక్షుడిగా ఎల్‌ఆర్‌ మహదేవస్వామి నియమితులయ్యారు. బెళగావి సిటీ అధ్యక్షురాలిగా గీతా సుతార్‌ నియమితులయ్యారు. జిల్లా అద్యక్ష పదవి దక్కించుకున్న ఏకైక మహిళా నేత ఈమె ఒక్కరే కావడం విశేషం. నూతన అధ్యక్షులతో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో 28 నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించి మోదీకి కానుక అందిద్దామని పిలుపునిచ్చారు.

Updated Date - Jan 17 , 2024 | 01:57 PM