Share News

Match-fixing: రాహుల్ 'మ్యాచ్ ఫిక్సింగ్' వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ABN , Publish Date - Apr 01 , 2024 | 08:13 PM

ఇండియా కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ చేసిన ''మ్యాచ్ ఫిక్సింగ్'' వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సారథ్యంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీ అధికారులకు సోమవారంనాడు కలిసి తమ ఫిర్యాదును అందజేసింది.

Match-fixing: రాహుల్ 'మ్యాచ్ ఫిక్సింగ్' వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఇండియా (I.N.D.I.A.)కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ చేసిన ''మ్యాచ్ ఫిక్సింగ్'' వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (Election Commission)కు బీజేపీ (BJP) ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సారథ్యంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈసీ అధికారులకు సోమవారంనాడు కలిసి తమ ఫిర్యాదును అందజేసింది.


రాహుల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం..

ఈసీ అధికారులను కలిసిన అనంతరం మీడియాతో హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరమని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫిక్స్‌డ్ మ్యాచ్‌ ఆరోపణలు, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నించడం, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. రాహుల్ చేసిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు. రాహుల్ మునుముందు ఎన్నికల ప్రచారంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని ఈసీని కోరామన్నారు. కాగా, ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన 'ఇండియా' కూటమి ర్యాలీలో రాహుల్ గాంధీ ''మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలుచేశారు. ఎన్నికల సంఘంలో కేంద్రం తమ వ్యక్తులను మోహరించిందని ఆరోపించారు. ఈవీఎంల విశ్వసనీయతను కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని మార్చే వీలుందని అన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 08:13 PM