Share News

Ayodhya Temple: అయోధ్యపై బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం

ABN , Publish Date - Feb 18 , 2024 | 07:21 PM

అయోధ్యలో భవ్య రామాలయాన్ని ప్రారంభించడంపై రెండ్రోజుల జాతీయ సదస్సులో ఒక తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. ప్రధాన మంత్రిపై శ్రీరామచంద్రుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నందునే జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా 'ప్రాణప్రతిష్ఠ' జరిగిందంటూ మోదీకి అభినందనలు తెలిపింది.

Ayodhya Temple: అయోధ్యపై బీజేపీ జాతీయ సదస్సులో తీర్మానం

న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయాన్ని (Ayodhya Ram temple) ప్రారంభించడంపై రెండ్రోజుల జాతీయ సదస్సులో ఒక తీర్మానాన్ని (Resolution) బీజేపీ (BJP) ఆమోదించింది. ప్రధాన మంత్రిపై శ్రీరామచంద్రుని ఆశీస్సులు పుష్కలంగా ఉన్నందునే జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా (Balak Ram) 'ప్రాణప్రతిష్ఠ' జరిగిందంటూ మోదీకి అభినందనలు తెలిపింది.


''అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించాలనేది బీజేపీ నిశ్చితాభిప్రాయం. రామచంద్రుని ఆశీస్సులతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్ధవంతంగా అయోధ్యలో భూమిపూజ, ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు. జనవరి 22న కోట్లాది మంది రామభక్తుల ఆకాంక్షలు నెరవేరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు సైతం ఆరోజు ఒక పవిత్రమైన రోజుగా నిలిచింది. అమృత్ కాల్‌లో దేశం కీర్తి ప్రతిష్ఠలను సరికొత్త శిఖరాలకు ప్రధాని తీసుకువెళ్లారు. ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశ ఐక్యత, సంఘీభావం చాటుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మోదీ తమ విధానాలతో, నాయకత్వ పటిమతో దేశ నైతిక శక్తిని పెంపొందించారు. ఇందుకు గాను మోదీ అభినందనీయులు'' అని ఆ తీర్మానం ప్రశంసించింది.

Updated Date - Feb 18 , 2024 | 07:21 PM