Share News

Lok sabha Elections 2024: బీహార్‌లో ఎన్డీయే సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్నంటే..?

ABN , Publish Date - Mar 05 , 2024 | 08:19 PM

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బీహార్‌ లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్‌కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.

Lok sabha Elections 2024: బీహార్‌లో ఎన్డీయే సీట్ల సర్దుబాటు.. నితీష్‌కు ఎన్నంటే..?

పాట్నా: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) భాగంగా బీహార్‌ (Bihar)లో ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్‌కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఫార్ములాపై బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమైంది. నిత్యానంద రాయ్, గిరిరాజ్ సింగ్, సుశీల్ మోదీ, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, బీహార్ ఇన్‌చార్జి వినోద్ తావ్డే, రాధా మోహన్ సింగ్, నాగేంద్ర కుమార్, తారాకిషోర్ ప్రసాద్, నందకిషోర్ యాదవ్, ధర్మశీల గుప్తా, ప్రేమ్‌కుమార్, జానక్ రామ్, ప్రేమ్ రంజన్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఎన్డీయే భాగస్వామ్యులు 2019 వెర్సన్ 2024

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఎల్‌జీపీలు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నారు. ఈసారి 2024లో బీజేపీ, జేడీయూతో పాటు ఉపేంద్ర కుష్వాహ (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ), జితిన్ రామ్ మాంఝీ (హిందుస్థానీ అవామీ మోర్చా), లోక్‌ జనశక్తి పార్టీకి చెందిన రెండు వేర్వేరు పార్టీలు (పశుపతి పరస్, చిరాగ్ పాశ్వాన్) ఎన్డీయే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.


ఝార్ఖాండ్, యూపీలో చెరో సీటు కోరుతున్న జేడీయూ

కాగా, బీహార్‌లో 14 సీట్లతో పాటు ఝార్ఖాండ్‌లోని ఛాత్ర సీటు, ఉత్తరప్రదేశ్‌లో ఫూల్‌పూర్ సీటును జేడీయూ కోరుతోందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 05 , 2024 | 08:44 PM