Share News

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

ABN , Publish Date - May 21 , 2024 | 12:30 PM

హైదరాబాద్: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు.

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఎఫ్ఐఆర్‌లో సెలబ్రిటీల పేర్లు..

హైదరాబాద్: బెంగళూరు (Banglore) ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City) సమీపంలోని ఓ ఫాం హౌస్‌ (Farm House)లో జరిగిన రేవ్ పార్టీ (Rave Party)లో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు (Vasu) ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ పార్టీకి సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్‌గా పార్టీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు (Police) తెలిపారు. నిర్వాహకుడు వాసుతోపాటు అరుణ్ (Arun), సిద్దికి (Siddiqui), రన్‌దీర్ (Randhir), రాజ్ భవ్‌ (Raj Bhav)లను పోలీసులు అరెస్టు చేశారు.


వాసు బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రన్‌దీర్, రాజ్‌భవ్‌లను డ్రగ్స్ పెడ్లర్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)కి చిక్కింది.


కాగా బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్‌ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు.


కన్నడ సీరియల్‌ నటులతోపాటు 20 మందికిపైగా మోడల్స్‌ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తోపాటు 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఎలక్ర్టానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కాగా, ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్‌ కోసం ఫౌంహౌస్‌ నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.50 లక్షలు చెల్లించినట్టు సమాచారం. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియరాలేదు. అందుకోసం మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.


పార్టీలో లేనన్న హేమ... ఉందన్న పోలీసులు?

పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్‌ సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్‌ ఉన్నట్లు తేలడంతో పాటు.. ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నారని మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో హేమ.. తాను రేవ్‌ పార్టీలో పాల్గొనలేదని, హైదరాబాద్‌లోనే చిల్‌ అవుతున్నానని ఓ వీడియో రిలీజ్‌ చేశారు. అయితే సాయంత్రానికి నటి హేమ తమ అధీనంలోనే ఉందని బెంగళూరు పోలీసులు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. హేమ రిలీజ్‌ చేసిన వీడియో నిజం కాదని, అందరినీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపినట్టు సమాచారం.


పార్టీలకు వెళ్లే అలవాటు లేదు: శ్రీకాంత్‌

రేవ్‌పార్టీలో పట్టుబడిన వారిలో ప్రముఖ తెలుగు సినీనటుడు శ్రీకాంత్‌ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో వెంటనే స్పందించిన శ్రీకాంత్‌.. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద నుంచి ఒక వీడియో విడుదల చేశారు. నాకు పార్టీలకు, పబ్‌లకు వెళ్లే అలవాటులేదని పేర్కొన్నారు. ఎక్కడైనా బర్త్‌డే పార్టీలకు వెళ్లినా కొద్దిసేపు ఉండి వెంటనే వచ్చేస్తానన్నారు. బెంగళూరులో పట్టుబడ్డ వారిలో ఒక వ్యక్తి నాలాగే కనిపించడంతో మీడియా మిత్రులు పొరపడి ఉంటారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..

వైభవంగా ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు..

. సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 12:51 PM