Share News

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం.. మరో నిందితుడు అరెస్ట్!

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:29 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం.. మరో నిందితుడు అరెస్ట్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ పేలుడు (Rameshwaram Cafe Blast) కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (National Investigation Agency) మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది. బుధవారం కర్ణాటకతో (12) పాటు తమిళనాడు (5), ఉత్తరప్రదేశ్‌ (1)లలో కలిపి మొత్తం 18 ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందాలు ఆపరేషన్స్ నిర్వహించి.. ముజమ్మిల్ షరీఫ్‌ని (Muzammil Shareef) అదుపులోకి తీసుకున్నాయి. అతడు మరో ఇద్దరు నిందితులకు పేలుడు పదార్థాలు, సాంకేతిక పరికరాలను సరఫరా చేశాడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

India Canada Row: భారత్‌పై కెనడా ప్రధాని మరోసారి సంచలన వ్యాఖ్యలు


అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ముస్సావిర్ షాజీబ్ హుసేన్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇతడే తలకు తోటోపీ, ముఖానికి ముసుగు ధరించి.. రామేశ్వరం కేఫ్‌లో బాంబ్ పెట్టాడు. తక్కువ తీవ్రత గల బాంబుని తెలివిగా అమర్చాడు. ఇతని ఆచూకీ తెలియకపోవడంతో.. ఎన్ఐఏ ఓ ఆఫర్ ప్రకటించింది. ముస్సావిర్ గురించి సమాచారం అందిస్తే.. వారికి రూ.10 లక్షల నగదు బహుమతిని ఇస్తామని తెలిపింది. సీసీటీవీ కెమెరాకు చిక్కిన అతని ఫోటోలతో పాటు వీడియోలను కూడా రిలీజ్ చేసింది.అతనితో పాటు మరో కుట్రదారుడైన అబ్దుల్ మతీన్ తాహా కూడా అజ్ఞాతంలో ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న తరుణంలో.. ఈ పేలుడు వెనుక పెద్ద కుట్ర ఉందని ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది.

Yuvraj Singh: హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్‌ని బూతులు తిట్టిన యువరాజ్.. కారణం ఇదే!

కాగా.. మార్చి 1వ తేదీన రామేశ్వరం కేఫ్‌లో బాబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఉగ్రదాడి అయ్యుండొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ, అందుకు సంబంధించిన ఆధారాలు దొరకలేదు. మార్చి 3వ తేదీన ఈ కేసుని ఎన్ఐఏ స్వాధీనం చేసుకొని.. వేగవంతంగా దర్యాప్తు చేస్తోంది. నిందితుల్ని పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. 18 ప్రదేశాల్లో నిర్వహించిన ఆపరేషన్స్‌లో భాగంగా.. ముజమ్మిల్‌ని అదుపులోకి తీసుకోగలిగారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అతడ్ని విచారించి, ఇతర నిందితులకు సంబంధించిన సమాచారం సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 10:49 PM