Share News

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి రోజు ఎంత మంది వస్తున్నారో తెలిపిన ఆలయ ట్రస్ట్

ABN , Publish Date - Mar 13 , 2024 | 10:24 AM

అయోధ్య(Ayodhya)లో రామ మందిరానికి(Ram Mandir) జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు సగటున రామ మందిరానికి ఎంత మంది వస్తున్నారో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Ram Mandir: అయోధ్య రామ మందిరానికి రోజు ఎంత మంది వస్తున్నారో తెలిపిన ఆలయ ట్రస్ట్

అయోధ్య(Ayodhya)లో రామ మందిరాని(Ram Mandir)కి జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు(devotees) ఆలయానికి తరలివస్తున్నారు. అంతేకాదు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం దర్శన సమయాన్ని కూడా మార్చారు. ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు సగటున రామ మందిరానికి లక్ష నుంచి 1.5 లక్షల మంది వస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్(Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) వెల్లడించింది.


అయితే ఇప్పటివరకు అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన జరిగినప్పటి నుంచి 75 లక్షల మందికి పైగా భక్తులు(pilgrims) సందర్శించారని తెలిపారు. అంతేకాదు భక్తుల రద్దీ కారణంగా ప్రస్తుతం అయోధ్యకు వెళ్లలేని వారు సైతం ఇంట్లో కూర్చొని రామ్ లల్లా ఆర్తిని ప్రత్యక్షంగా చూడవచ్చని పేర్కొన్నారు. దూరదర్శన్(doordarshan)లో ప్రతిరోజు ఉదయం 6.30 గంటలకు అయోధ్య రామ మందిరం నుంచి రోజువాకి హారతిని ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, దీనిని వీక్షించవచ్చని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ranji Trophy Final: సచిన్ చారిత్రాత్మక రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు

Updated Date - Mar 13 , 2024 | 10:24 AM