Atishi Writes LG: ప్రార్థనా మందిరాలను కూల్చొద్దు.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అతిషి లేఖ
ABN , Publish Date - Dec 31 , 2024 | 08:00 PM
మతపరమైన కట్టడాలను కూల్చివేస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని అతిషి తెలిపారు. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అతిషి మంగళవారంనాడు లేఖ రాశారు.

న్యూఢిల్లీ: ఆలయాలు, బౌద్ధ కట్టడాలను కూల్చివేయాలన్న ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) కోరారు. మతపరమైన కట్టడాలను కూల్చివేస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అతిషి మంగళవారంనాడు లేఖ రాశారు.
PM Modi: సమష్టి విజయాల వత్సరం.. 2025లోనూ వికసిత్ భారత్ దిశగా అడుగులు
ఢిల్లీ వ్యాప్తంగా పలు మతపరమైన కట్టడాలను కూల్చివేయాలని నవంబర్ 23న జరిగిన సమావేశంలో రెలిజియస్ కమిటీ ఆదేశించిన విషయం తన దృష్టికి వచ్చిందని అతిషి ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది వరకూ రెలిజియస్ కమిటీ నిర్ణయం తమ వద్దకు వచ్చేదని, అయితే ఈసారి ఆ ప్రక్రియను పాటించలేదని అన్నారు. మతపరమైన కట్టకాల కూల్చివేత అంశం 'పబ్లిక్ ఆర్డర్' కిందకు వస్తుందని గత ఏడాది ఎల్జీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. 'పబ్లిక్ ఆర్డర్' అశం ఎన్నికైన ప్రభుత్వం పరిథిలోకి కాకుండా ఎల్జీ పరిధిలోకి వస్తుందంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాన్ని అతిషి గుర్తు చేశారు. ఆ ప్రకారం రెలిజియస్ కమిటీని నేరుగా ఎల్జీ పరిధిలోకి తీసుకున్నందున మతపరమైన కట్టడాల కూల్చివేతను నిలిపివేయాలని వీకే సక్సేనాను అతిషి కోరారు. మతపరమైన మనోభావాలు గాయపడే అవకాశం ఉన్నందున ఢిల్లీ ప్రజల తరఫున తాను ఈ విజ్ఞప్తి చేస్తు్న్నానని అన్నారు. అతిషి తన లేఖలో ప్రార్థనా స్థలాల జాబితాను ఇస్తూ, వీటిని కూల్చివేయవద్దని కోరారు.
అతిషిని తాత్కాలిక ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పేర్కొనడం తనను బాధించిందని, రాజ్యాగంలో తాత్కాలిక ముఖ్యమంత్రి ప్రొవిజన్ ఏదీ లేదని పేర్కొంటూ సీఎంకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సోమవారంనాడు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆలయాలను కూల్చివేసే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ ఎల్జీకి అతిషి మంగళవారం లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
CM MK Stalin : కన్యాకుమారిలో అద్దాల వంతెన
‘మహా’ కుంభమేళా!
Read More National News and Latest Telugu News