Share News

Anurag Thakur: మానవత్వం చచ్చిపోయిందా.. సీఏఏను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై అనురాగ్ ఠాకూర్ ఫైర్

ABN , Publish Date - Mar 12 , 2024 | 07:36 PM

కేంద్ర ప్రభుత్వం (Central Govt) అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) (Citizenship Amendment Act) వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై (Opposition Parties) కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మండిపడ్డారు. పొరుగు దేశాల్లో మతపరమైన మైనార్టీల హక్కులను అణగదొక్కడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు.

Anurag Thakur: మానవత్వం చచ్చిపోయిందా.. సీఏఏను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై అనురాగ్ ఠాకూర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వం (Central Govt) అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) (Citizenship Amendment Act) వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై (Opposition Parties) కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మండిపడ్డారు. పొరుగు దేశాల్లో మతపరమైన మైనార్టీల హక్కులను అణగదొక్కడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రత్యర్థి పార్టీలకు మానవత్వం చచ్చిపోయిందా?’’ అని ప్రశ్నించారు. ‘‘పొరుగు దేశాల్లో హింసించబడిన శరణార్థ హిందూ కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలి? వాళ్లు పట్టపగలే అత్యాచారానికి గురవుతున్నారు. బలవంత వివాహాలు, మతమార్పిడులను వాళ్లు ఎదుర్కొంటున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం లేకపోతే.. ఆఫ్ఘనిస్తాన్‌లో (Afghanistan) సిక్కులు, గురుగ్రంథ్ సాహిబ్‌లను దురాగతాల నుంచి ఎవరు రక్షించేవారని నిలదీశారు. గత 70 సంవత్సరాల నుంచి పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు ఇప్పుడు సీఏఏ (CAA) ద్వారా ప్రయోజనం పొందుతారని ఠాకూర్ నొక్కి చెప్పారు.


ఇదిలావుండగా.. కాంగ్రెస్ (Congress), మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), సిపిఐ(ఎం), ఇతర అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ సీఏఏను వ్యతిరేకించాయి. పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో అనుసంధానించడం ద్వారా.. ఈ సీఏఏ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని ఉద్ఘాటించాయి. సమాజాన్ని విభజించడానికి, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు అశాంతి వాతావరణం నెలకొల్పడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. లోక్‌సభ ఎన్నికల ముందే దీనిని ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారని ప్రశ్నించాయి. పొరుగు దేశాలకు చెందిన పేదలను భారతదేశంలో తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి సీఏఏ అమలుతో బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శించారు. అసలు సమస్యలను పరిష్కరించడానికి బదులుగా సీఏఏని తీసుకొచ్చారని మండిపడ్డారు. మరోవైపు.. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయనివ్వమని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. అనురాగ్ ఠాకూర్ పైవిధంగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 07:36 PM