Share News

Lok Sabha Elections: అన్నామలై బీజేపీకి ఆశ్చర్యకర ఫలితాలు.. సర్వే జోస్యం

ABN , Publish Date - Apr 16 , 2024 | 05:24 PM

ద్రవిడ పార్టీల కంచుకోట తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సంచలన ఫలితాలను సాధించబోతోందా? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై సారథ్యంలోని బీజేపీ అనూహ్యమైన ఫలితాలను రాబట్టనుందా? 'ఇండియా టీవీ-సీఎన్ఎక్స్' ఒపీనియన్ పోల్ అవుననే చెబుతోంది. ఏప్రిల్ 19న తమిళనాట జరిగే పోల్స్‌లో బీజేపీ ఈసారి ఆశ్యర్యకరమైన ఫలితాలను సాధిచనున్నట్టు జోస్యం చెప్పింది.

Lok Sabha Elections: అన్నామలై బీజేపీకి ఆశ్చర్యకర ఫలితాలు.. సర్వే జోస్యం

న్యూఢిల్లీ: ద్రవిడ పార్టీల కంచుకోట తమిళనాడు (Tamil Nadu) లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) సంచలన ఫలితాలను సాధించబోతోందా? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై (K Annamalai) సారథ్యంలోని బీజేపీ అనూహ్యమైన ఫలితాలను రాబట్టనుందా? 'ఇండియా టీవీ-సీఎన్ఎక్స్' ఒపీనియన్ పోల్ అవుననే చెబుతోంది. ఏప్రిల్ 19న తమిళనాట జరిగే పోల్స్‌లో బీజేపీ ఈసారి ఆశ్యర్యకరమైన ఫలితాలను సాధిచనున్నట్టు జోస్యం చెప్పింది.


తమిళనాడులో బీజేపీ 19 సీట్లలో ఎలాంటి పొత్తులూ లేకుండా పోటీ చేస్తోంది. కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీ చేస్తున్నారు. ఈసారి బీజేపీ అనూహ్యమైన ఫలితాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయని, అయితే త్రిముఖ పోటీలో (డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, బీజేపీ) డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంటుందని సర్వే తేల్చిచెప్పింది. బీజేపీ సొంతంగా 4 స్థానాలు గెలుచుకుంటుందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 6 సీట్లు సాధించుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే అంచనా వేసింది.

Lok Sabha Polls 2024: తొలి దశ పోలింగ్‌కు ఈసీ సన్నాహాలు


అధికార పార్టీని పలు ప్రజాసమస్యలపై అన్నామలై సూటిగా నిలదీస్తుండటం, ఆయన ముక్కుసూటితనం, ప్రజలకు సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తుండటం బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే‌కు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయని అంటున్నారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 16 , 2024 | 05:24 PM