Share News

Delhi: అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు.. కాంగ్రెస్‌ నేత అరుణ్‌రెడ్డి అరెస్టు..

ABN , Publish Date - May 05 , 2024 | 05:25 AM

సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేత అరుణ్‌రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Delhi: అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు.. కాంగ్రెస్‌ నేత అరుణ్‌రెడ్డి అరెస్టు..

  • మూడు రోజుల పాటు పోలీసు కస్టడీ అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసు..

  • కాంగ్రెస్‌ నేత అరుణ్‌రెడ్డి అరెస్టు

న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేత అరుణ్‌రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్స్‌లో ‘స్పిరిట్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌’ ఖాతాను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా జాతీయ కన్వీనర్‌ అరుణ్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ప్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌(ఐఎ్‌ఫఎ్‌సవో) అధికారులు అరెస్టు చేసి, పటియాలా కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు.


అమిత్‌ షా ఫేక్‌ వీడియోలో అరుణ్‌ రెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి.. వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో అరుణ్‌ రెడ్డిని మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అరుణ్‌రెడ్డి ఫోన్లను సీజ్‌ చేసినట్లు అధికారులు వివరించారు. ఈ అరెస్టుపై కాంగ్రెస్‌ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. అరుణ్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 05 , 2024 | 05:25 AM