Share News

Bill Gates: ప్రధాని మోదీని కలిసిన బిల్ గేట్స్.. కారణమిదేనా?

ABN , Publish Date - Mar 01 , 2024 | 07:28 AM

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ బిల్ గేట్స్ భారత పర్యటన సందర్భంగా వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో ఆయన గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

Bill Gates: ప్రధాని మోదీని కలిసిన బిల్ గేట్స్.. కారణమిదేనా?

భారత పర్యటనకు వచ్చిన బిలియనీర్ వ్యాపారవేత్త బిల్ గేట్స్(Bill Gates) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ని కలిశారు. పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య గురువారం న్యూఢిల్లీ(delhi)లో సవివరమైన చర్చ జరిగింది. ఈ క్రమంలో మోదీ ఫోటోను బిల్ గేట్స్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ప్రధాని మోదీ కంటే ముందు గేట్స్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా కలిశారు. PM మోడీతో తన చిత్రాన్ని పంచుకుంటూ బిల్ గేట్స్ ఇలా పేర్కొన్నారు. ఆయనను కలవడం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మోదీతో కలిసి చర్చించడం చాలా సంతోషంగా ఉంది. మేము ప్రజా ప్రయోజనాలు, AI గురించి మాట్లాడాము. మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అనుకూలతలో ఆవిష్కరణల వంటి అంశాల గురించి చర్చించినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే బిల్ గేట్స్ ట్విట్ రీ ట్వీట్ చేస్తూ సమావేశమైన తర్వాత, ప్రధాని మోదీ(modi) ఈ సమావేశం గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆయా అంశాలు, రంగాలపై బిల్ గేట్స్‌తో జరిపిన సంభాషణ చిరస్మరణీయమని ఆయన అన్నారు. దీని కారణంగా మన భూమి నిరంతరం మెరుగైన గ్రహంగా మారుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ కృషిని ప్రస్తావిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సాధికారత పొందుతున్నారని ప్రధాని అన్నారు.


మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా(mansukh mandaviya)ను కలవడం గురించి బిల్ గేట్స్ xలో ఓ పోస్ట్ చేశారు. డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్‌లను పరిశీలించిన నేపథ్యంలో టీబీ, సికిల్ సెల్, ప్రసూతి రక్తహీనతను తొలగించే ప్రయత్నాలపై మన్సుఖ్ మాండవియాతో మాట్లాడినట్లు బిల్ గేట్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. భారతీయ పరిశోధనలు, సాంకేతికతను ప్రభావితం చేయడానికి మా భాగస్వామ్య నిబద్ధతపై మేము చర్చించినట్లు వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ ఇండియా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమ భాగస్వామ్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతకుముందు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా బిల్ గేట్స్‌పై ప్రశంసలు కురిపించారు.

bill gates.JPG

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: BJP: ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం.. కీలక విషయాలేంటంటే....

Updated Date - Mar 01 , 2024 | 08:04 AM