Share News

Actress Radhika: ఎన్నికల ప్రచారంలో.. నటి రాధిక నోట తెలుగు పలుకులు..

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:55 PM

విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి రాధిక(Actress Radhika) ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భర్త శరత్‌కుమార్‌(Sarath Kumar)ను వెంటబెట్టుకుని ఆమె ప్రచారం చేస్తున్నారు.

Actress Radhika: ఎన్నికల ప్రచారంలో.. నటి రాధిక నోట తెలుగు పలుకులు..

చెన్నై: విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి రాధిక(Actress Radhika) ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భర్త శరత్‌కుమార్‌(Sarath Kumar)ను వెంటబెట్టుకుని ఆమె ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యనార్‌ నగర్‌, చంద్రగిరిపురం, సీనియాపురం తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నట్లు తెలుసుకున్న రాధిక తెలుగులో ప్రచారంచేశారు. కేంద్రంలో పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం అవనీతి రహిత పాలన అందించినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ మూడోసారి గెలిచి కొత్తచరిత్ర సృష్టించనున్నారని తెలిపారు. ఆమెతోపాటు భర్త శరత్‌కుమార్‌ ప్రచారం చేసి తెలుగు ఓటర్లను బాగా ఆకట్టుకున్నారు.

nani6.jpg

ఇదికూడా చదవండి: Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

Updated Date - Apr 12 , 2024 | 12:55 PM