Share News

Radhika Apte: ఎయిర్‌పోర్టులో గంటల తరబడి నిరీక్షించిన రాధికా ఆప్టే

ABN , Publish Date - Jan 13 , 2024 | 05:19 PM

నటి రాధికా ఆప్టేకు చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ కోసం తోటి ప్రయాణికులతో కలిసి నిరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది.

 Radhika Apte: ఎయిర్‌పోర్టులో గంటల తరబడి నిరీక్షించిన రాధికా ఆప్టే

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: నటి రాధికా ఆప్టేకు (Radhika Apte) చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ కోసం తోటి ప్రయాణికులతో కలిసి నిరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ఇన్ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతున్నారో..? ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

ఉదయం 8.30 గంటలకు తమను ఎరొబ్రిడ్జిలోకి పంపించారని రాధికా ఆప్టే (Radhika Apte) తెలిపారు. ఆ వెంటనే ఫ్లైట్ డిలే అయ్యిందని సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఎరొబ్రిడ్జిలో ఉంచి లాక్ చేశారని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వెయిట్ చేస్తూనే ఉన్నామని వివరించారు. ఇక్కడ తాగేందుకు కనీసం మంచినీరు లేవన్నారు. ప్రయాణికుల్లో కొందరు చిన్న పిల్లలు, మరికొందరు వృద్దులు ఉన్నారని తెలిపారు. వయస్సును దృష్టిలో ఉంచుకొని భద్రతా సిబ్బంది తలుపు తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాధికా ఆప్టే షేర్ చేసి వీడియోల్లో కొందరు వృద్దులు డోర్ వెనకాల ఉన్నారు. మరికొందరు భద్రతా సిబ్బందితో మాట్లాడుతున్నారు. విమానం ఆలస్యం కావడానికి గల కారణం సిబ్బంది షిఫ్ట్ మారడమని తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 13 , 2024 | 05:19 PM