Share News

National: నాకు రేప్‌, హత్య బెదిరింపులు: స్వాతి మాలీవాల్‌

ABN , Publish Date - May 27 , 2024 | 04:14 AM

తనకు రేప్‌, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ తనకు వ్యతిరేకంగా ఏకపక్షంగా రూపొందించిన వీడియోతో ఈ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు.

National: నాకు రేప్‌, హత్య బెదిరింపులు: స్వాతి మాలీవాల్‌

న్యూఢిల్లీ, మే 26: తనకు రేప్‌, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీ తనకు వ్యతిరేకంగా ఏకపక్షంగా రూపొందించిన వీడియోతో ఈ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు.

ఆదివారం ఆమె ‘ఎక్స్‌’ వేదికగా ఒక పోస్టు చేశారు. తనను భయపెట్టి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయాలని పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశారని స్వాతి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - May 27 , 2024 | 04:15 AM