Share News

Lok Sabha Elections: పాలన పంజాబ్‌లో.. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో...

ABN , Publish Date - May 24 , 2024 | 08:08 PM

ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో కూర్చుని పంజాబ్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్ సీఎం సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకున్నారని విమర్శించారు.

Lok Sabha Elections: పాలన పంజాబ్‌లో.. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో...

గురుదాస్‌పూర్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్రనేతలు ఢిల్లీలో కూర్చుని పంజాబ్ (Punjab) ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. పంజాబ్ సీఎం సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేకున్నారని విమర్శించారు. గురుదాస్‌పూర్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ, రిమోట్ కంట్రోల్ ద్వారా పంజాబ్‌లో పాలన సాగుతుండటం దురదృష్టకరమని అన్నారు.


ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1వ తేదీ వరకూ తీహార్ జైలు నుంచి బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్‌ను పరోక్షంగా మోదీ ప్రస్తావిస్తూ...''ఢిల్లీ దర్బారీలు పంజాబ్‌ను పాలిస్తున్నారు. పంజాబ్ సీఎం సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకునే స్థితిలో లేరు. ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన ఆదేశాల కోసం తీహార్ జైలు చుట్టూ ఆయన తిరుగుతున్నారు. జూన్ 1 తర్వాత తిరిగి ఆయన (కేజ్రీవాల్) జైలుకు వెళ్తారు. పంజాబ్ ప్రభుత్వం మళ్లీ జైలు నుంచే పాలన సాగించాలని అనుకుంటోందా?" అని మోదీ ప్రశ్నించారు.

Medha Patkar: పరువునష్టం కేసులో మేథాపాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు


వేర్పాటువాదానికి ఊపిరి పోసింది వారే..

పంజాబ్ ప్రజలకు 'ఇండి' కూటమి నిజస్వరూపం ఏమిటో బాగా తెలుసునని, ఆకూటమి చేతుల్లో పంజాబ్ ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొందన్నారని ప్రధాని అన్నారు. విభజన, అస్థిరత, ఉగ్రవాదం, పంజాబ్ విశ్వాసాలు, సౌభ్రాతృత్వంపై దాడి వంటివి వారి హయాంలోనే చేటుచేసుకున్నాయని చెప్పారు. పంజాబ్‌లో వేర్పాటువాదానికి వారు ఊపిరులు పోశారని, ఫలితంగా ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగిందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నంత వరకూ అల్లర్లకు పాల్పడేవారికి ఆశ్రయం ఇస్తూనే ఉంటుందన్నారు. అయితే 1984 కేసు ఫైల్స్‌ను మోదీ సర్కార్ తిరిగి ఓపెన్ చేసి, నిందితులను శిక్షిస్తామనే భరోసా కల్పించిందని గుర్తు చేశారు.''ఈ గడ్డ నుంచి ప్రమాణం చేస్తున్నాను. ఈ దేశాన్ని అదృశ్యం కానీయను. ఎవరికీ తలవంచే పరిస్థితి రానీయను. దేశ పురోగమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగనీయను'' అని మోదీ భరోసా ఇచ్చారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 08:09 PM