Share News

Medha Patkar: పరువునష్టం కేసులో మేథాపాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

ABN , Publish Date - May 24 , 2024 | 07:07 PM

హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథా పాట్కార్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వేసిన పరువునష్టం కేసులో ఆమెను దోషిగా నిర్దారిస్తూ సాకేత్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ శుక్రవారంనాడు తీర్పు చెప్పారు.

Medha Patkar: పరువునష్టం కేసులో మేథాపాట్కర్‌ను దోషిగా తేల్చిన కోర్టు

న్యూఢిల్లీ: హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథా పాట్కార్ (Medaha Patkar) చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai Kumar Saxena) వేసిన పరువునష్టం కేసులో ఆమెను దోషి (Convicted)గా నిర్దారిస్తూ సాకేత్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ శుక్రవారంనాడు తీర్పు చెప్పారు. చట్టం ప్రకారం, క్రిమినల్ డిఫమేషన్‌ కేసులో దోషిగా తేలినందున ఆమెకు రెండేళ్ల జైలు లేదా జరిమానా, లేకుంటే రెండూ పడే అవకాశం ఉంటుంది.

Prajwal Revanna Scandal: ప్రజ్వల్ పాస్‌పోర్టు రద్దు చేయండి.. కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ


మేథాపాట్కర్‌కు, ఢిల్లీ ఎల్జీకి మధ్య 2000 నుంచి న్యాయపోరాటం జరుగుతోంది. తనపైన, నర్మదా బచావో ఆందోళన్ (ఎన్‌బీఏ)కు వ్యతిరేకంగాను అడ్వర్‌టైజ్‌మెంట్లు పబ్లిష్ చేరానని వీకే సింగ్‌పై ఆమె కేసు పెట్టారు. అప్పట్లో వీకే సక్సేనా అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీఓకు చీఫ్‌గా ఉన్నారు. సక్సేనా సైతం ఒక టీవీ ఛానెల్‌లో మేథాపాట్కర్ తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యాలు చేశారని, పరువునష్టం కలిగించే విధంగా పత్రికా ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ రెండు కేసులు పెట్టారు.

Read Latest News and National News here

Updated Date - May 24 , 2024 | 07:07 PM