Share News

Bansuri Swaraj: మొహల్లా క్లినిక్స్‌లో నకిలీ మందులు.. ఆప్‌ సర్కార్‌పై బీజేపీ ఫైర్

ABN , Publish Date - Apr 07 , 2024 | 06:14 PM

ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఘనంగా చెబుతున్న మొహల్లా క్లినిక్స్ పై బీజేపీ పెదవి విరిచింది. రాజధాని నగరంలో మొహల్లా క్లినిక్‌ల పరిస్థితి దయనీయంగా ఉందని న్యూఢిల్లీ లోక్‌సభ పార్లమెంటరీ నియోజవర్గం బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ అన్నారు. నకిలీ మందులు అమ్ముతున్నారని, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందే పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.

Bansuri Swaraj: మొహల్లా క్లినిక్స్‌లో నకిలీ మందులు.. ఆప్‌ సర్కార్‌పై బీజేపీ ఫైర్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ఘనంగా చెబుతున్న మొహల్లా క్లినిక్స్ (Mohalla Clinics)పై బీజేపీ (BJP) పెదవి విరిచింది. రాజధాని నగరంలో మొహల్లా క్లినిక్‌ల పరిస్థితి దయనీయంగా ఉందని న్యూఢిల్లీ లోక్‌సభ పార్లమెంటరీ నియోజవర్గం బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ (Bansuri Swaraj) అన్నారు. నకిలీ మందులు అమ్ముతున్నారని, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందే పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.

Lok Sabha Elections: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' తప్పనిసరి: రాజ్‌నాథ్ సింగ్


''ఒకవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనౌషధి కేంద్రాల్లో మంచి నాణ్యత, తక్కువ ఖరీదైన మందులు పంపిణీ చేస్తుంటే, మరోవైపు ఆప్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్స్‌లో నకిలీ మందులు పంచుతోంది. ఈ క్లినిక్‌లలో పేషెంట్లకు వైద్యులు చికిత్స అందించడం లేదు. అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందే ఆ పని చేసుకుంటున్నారు. ఇదేనా వారి ఢిల్లీ మోడల్?'' అని బన్సూరి స్వరాజ్ ప్రశ్నించారు.


జల్‌ బోర్డ్ స్కామ్..

బీజేపీ ఇంటింటికి ట్యాప్ వాటర్ కనెక్షన్లు ఇస్తుంటే, ఆప్ మాత్రం జల్ బోర్డ్ స్కామ్స్‌లో ఉందని, ఢిల్లీ మొత్తం కేజ్రీవాల్ అవినీతి గుప్పిట్లో విలవిల్లాడుతుంటే, ఆయన మాత్రం అధికారం, స్కామ్‌లతో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు 'ఆప్' సానుభూతి నాటకాలు కూడా ఆడుతోందని, ఢిల్లీ ప్రజలు దీనిని బాగా అర్థం చేసుకోగలరని అన్నారు. కాగా, మే 5న ఒకే విడతలో ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. 2014, 2019లో బీజేపీ ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను గంపగుత్తగా గెలుచుకుంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 06:14 PM