Share News

Lok Sabha Elections: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' తప్పనిసరి: రాజ్‌నాథ్ సింగ్

ABN , Publish Date - Apr 07 , 2024 | 05:35 PM

''ఒకే దేశం-ఒకే ఎన్నిక'' పేరుతో లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల వరకూ ఎన్నికలన్నీ ఒకేసారి జరిపేందుకు కేంద్రం కొద్దికాలంగా కసరత్తు చేస్తోంది. ఆదివారంనాడు లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశ వనరులు, సమయం ఆదా కావాలంటే 'ఒకే దేశం ఒకే ఎన్నిక' తప్పనిసరి అని అన్నారు.

Lok Sabha Elections: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' తప్పనిసరి: రాజ్‌నాథ్ సింగ్

కోలాయత్: ''ఒకే దేశం-ఒకే ఎన్నిక'' (One nation and one elections) పేరుతో లోక్‌సభ నుంచి స్థానిక సంస్థల వరకూ ఎన్నికలన్నీ ఒకేసారి జరిపేందుకు కేంద్రం కొద్దికాలంగా కసరత్తు చేస్తోంది. ఆదివారంనాడు లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశ వనరులు, సమయం ఆదా కావాలంటే 'ఒకే దేశం ఒకే ఎన్నిక' తప్పనిసరి అని అన్నారు. ఈ ఆలోచనను కాంగ్రెస్ పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తోందని తెలిపారు.


రాజస్థాన్‌లోని బికనెర్ జిల్లా కోలాయత్‌లో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ''ఒకే దేశం, ఒకేసారి ఎన్నికలు'' అనివార్యమని, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాయకత్వంలో ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందని, కమిటీ సైతం తమ నివేదకను రాష్ట్రపతికి సమర్పించిందని తెలిపారు. దేశ ప్రజలంతా దీనిని మద్దతు చెబుతారని తాను నమ్ముతునట్టు చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈ ఆలోచనను వ్యతిరేకిస్తోందని, ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే ఆ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఒకే దేశంలో ఒకే ఎన్నికలతో దేశ వనరులు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పారు.

Lok Sabha Elections: జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం కాదా?.. ఖర్గే‌ వ్యాఖ్యలపై మోదీ కౌంటర్


బీజేపీ వచ్చాకే..

రాజస్థాన్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై రాజ్‌నాథ్ విమర్శలు గుప్పిస్తూ, వారి హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేవి కావని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ ప్రతిష్ట ప్రపంచదేశాల్లో ఇనుమడించిందని అన్నారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై దేశ వాణిని పట్టించుకునే వారే కాదని, ఈరోజు ఎక్కడ మాట్లాడినా భారత్ ఏమి చెబుతోందనని యావత్ ప్రపంచం చెవులు అప్పగించి మరీ ఆసక్తిగా వింటోందని అన్నారు. భారత్‌ను పేద దేశంగా, నిరుద్యోగిత కలిగిన దేశంగా చెప్పుకునే వారని, 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదిగిందని, ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని తెలిపారు. 2027 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఎదుగుతుందని ఆర్థిక సంస్థల సర్వేలు, సమీక్షలు విస్పష్టంగా చెబుతున్నాయని అన్నారు.


రాజస్థాన్‌లో రెండు విడతలుగా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 18న 12 లోక్‌సభ స్థానాలకు, 19న తక్కిన 13 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడతాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 05:35 PM