Share News

National: యువతలో పెరుగుతున్న కేన్సర్‌!

ABN , Publish Date - May 27 , 2024 | 02:59 AM

ఇటీవలి కాలంలో యువతలో కేన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ‘కేన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌’ తాజా అధ్యయనంలో గుర్తించింది. ప్రముఖ ఆంకాలజిస్టుల ఆధ్వర్యంలో నడిచే ఈ ఎన్‌జీవో సంస్థ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తున్న.........

National: యువతలో పెరుగుతున్న కేన్సర్‌!

న్యూఢిల్లీ, మే 26: ఇటీవలి కాలంలో యువతలో కేన్సర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ‘కేన్సర్‌ ముక్త్‌ భారత్‌ ఫౌండేషన్‌’ తాజా అధ్యయనంలో గుర్తించింది. ప్రముఖ ఆంకాలజిస్టుల ఆధ్వర్యంలో నడిచే ఈ ఎన్‌జీవో సంస్థ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేస్తున్న కేన్సర్‌ రోగుల్లో 20 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారేనని గుర్తించింది.

ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 15 మధ్యకాలంలో 1,368 మంది హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశారని, వారిలో 20 శాతం మంది 20-40 ఏళ్ల మధ్య వయస్కులేనని ఈ సంస్థ వెల్లడించింది. 40 ఏళ్లలోపు కేన్సర్‌ రోగుల్లో 60 శాతం మంది పురుషులేనని పేర్కొంది. తాజాగా నమోదవుతున్న వాటిలో తల, మెడ కేన్సర్‌ కేసులు 26 శాతం, జీర్ణాశయాంతర కేన్సర్లు 16 శాతం, రొమ్ము కేన్సర్‌ 15 శాతం, బ్లడ్‌ కేన్సర్‌ 9 శాతం ఉన్నట్టు గుర్తించారు.

హెల్ప్‌లైన్‌కు హైదరాబాద్‌ నుంచి ఎక్కువ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని తెలిపింది. కేన్సర్‌ బారిన పడిన రోగులు ఉచితంగా సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవడం కోసం ఈ హెల్ప్‌లైన్‌ (9355520202) నంబర్‌ను ప్రారంభించారు.

Updated Date - May 27 , 2024 | 02:59 AM