Share News

Covid Update: 700 దాటిన కరోనా కేసులు, మరో ఇద్దరు మృతి..వ్యాపిస్తున్న కొత్త వేరియంట్

ABN , Publish Date - Jan 06 , 2024 | 02:09 PM

భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా గత 24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు కాగా.. రెండు మరణాలు రికార్డయ్యాయి.

Covid Update: 700 దాటిన కరోనా కేసులు, మరో ఇద్దరు మృతి..వ్యాపిస్తున్న కొత్త వేరియంట్

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 774 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు మరో ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించారు. ఈ మృతుల్లో గుజరాత్, తమిళనాడులో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,187కు చేరుకుంది. వీటిలో కొత్త వేరియంట్ JN.1 కారణంగా రికార్డైన కేసులు 600కుపైగా ఉండటం ప్రస్తుతం ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం వివరాలను ప్రకటించింది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Indian Crew: భారత్ మాతా కీ జై అంటూ నావికాదళానికి థాంక్స్..కారణమిదే

అధికారిక వర్గాల ప్రకారం డిసెంబర్ 5 నుంచి ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో కోవిడ్-19 కేసులు డిసెంబర్ 31, 2023న 841 నమోదయ్యాయి. ఇది మే 2021లో నమోదైన అత్యధిక కేసుల్లో 0.2 శాతం. మరోవైపు కరోనా చికిత్స పొందుతున్న మొత్తం 4,187 మందిలో 92 శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

2020 ప్రారంభం నుంచి గత నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీని కారణంగా 5.3 లక్షల మందికిపైగా మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకుపైగా ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉండగా..దేశంలో కోవిడ్-19 కట్టడి కోసం ఇప్పటివరకు 220.67 కోట్ల డోసులు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - Jan 06 , 2024 | 02:09 PM