Share News

Viral News: బాంబు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న WHO చీఫ్.. ఏమైందంటే..

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:56 PM

యెమెన్‌ సనా విమానాశ్రయంలో ఇటివల జరిగిన బాంబు దాడి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తృటిలో తప్పించుకున్నారు. బాంబు దాడి జరిగినప్పుడు టెడ్రోస్ సహచరులతో కలిసి సమీపంలోనే ఉన్నారు. అయితే అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: బాంబు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న WHO చీఫ్.. ఏమైందంటే..
Tedros Adhanom

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus) ఒక పెను ప్రమాదం నుంచి కొంచెంలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా పేజీ ద్వారా తెలిపారు. ఈ సంఘటన టెడ్రోస్ యెమెన్ చేరిన సందర్భంలో జరిగింది. ఆయన అక్కడ ఐక్యరాజ్యసమితి (UN), WHO సహచరులతో కలిసి కొంత కాలం ఇరాన్ హౌతీ యోధుల చేత బందీగృహంలో ఉన్న UN ఉద్యోగులని విడుదల చేయాలనే కార్యక్రమం కోసం వెళ్లారు.


విమానం ఎక్కబోతుండగా

ఆ సమయంలోనే టెడ్రోస్ తన సహచరులతో కలిసి విమానాశ్రయం వద్ద విమానం ఎక్కబోతుండగా ఒక్కసారిగా బాంబు దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో వాళ్ళు విమానాశ్రయంలో ఉన్న ఒక డిపార్చర్ లాంజ్ సమీపంలో ఉన్నారు. కానీ కొన్ని మీటర్ల దూరంలోనే బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో విమానాశ్రయ సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. దీంతోపాటు విమానాశ్రయం వద్ద జరిగిన బాంబు దాడిలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయంపై బాంబులు పడటంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, రన్‌వేలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు.


ప్రాణాలు కోల్పోయిన వారికి

ఈ దాడి తరువాత టెడ్రోస్ మరింత సమాచారం అందిస్తూ తన సహచరుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం విమానాశ్రయంలో జరిగిన నష్టం మరమ్మతు చేయనిచ్చే వరకు విమానం బయలుదేరడం కుదరదని పేర్కొన్నారు. అంతేకాదు యెమెన్‌లోని సనా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎయిర్‌పోర్టు ఇంకా పునరుద్ధరించబడలేదని, ఆయన, తన సహచరులు సురక్షితంగా ఉన్నామని చెప్పారు.


విజ్ఞప్తి

దీంతోపాటు ఈ దాడి విషయాన్ని ఐక్యరాజ్యసమితి (UN) చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించారు. ఈ దాడికి సంబంధించి మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా పౌరులు, మానవతావాద కార్మికులపై ఎలాంటి దాడులు చేయకూడదని సూచించారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, సైనిక చర్యలను నిలిపివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో అన్ని పక్షాల విషయంలో సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బాంబు దాడి వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుటెర్రెస్ తెలిపారు. సనాలో జరిగిన ఈ దాడిలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఇతరులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు.


కామెంట్లు..

ఈ బాంబు దాడి ఇజ్రాయెల్ హౌతీ యోధులపై చేస్తున్న నిరంతర దాడుల భాగంగా జరిగిందని కూడా చెప్పవచ్చు. హౌతీలు కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు విసిరేస్తూ, తమ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా సమాచారం అందింది. ఈ ఘటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గాయపడి, మరణించకుండా తప్పించుకోవడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది తెలిసిన పలువురు ఈ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More International News and Latest Telugu News

Updated Date - Dec 27 , 2024 | 01:09 PM