Share News

Nellore Cow: బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు సరికొత్త రికార్డు

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:31 PM

బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లో జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు కోనుగోలు చేశారు. దీంతో ఈ జాతి ఆవుకు సరికొత్త రికార్డు సృష్టించింది.

Nellore Cow: బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు సరికొత్త రికార్డు

బ్రసీలియా, మార్చి 27: బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లోని సావో పాలో అరండోలో ( Arandú, São Paulo Brazil) జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్ల ధర పలికింది. దీంతో ఈ జాతి ఆవు సరికొత్త రికార్డు సృష్టించినట్టయ్యింది. భారతీయ కరెన్సీలో ఈ ఆవు ధర రూ.40 కోట్లు ధర పలికింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలు జాతి ఆవులను వయాటినా 19 ఎఫ్ఐవి మారా ఇమోవిస్ (Viatina-19 FIV Mara Imóveis) అని పిలుస్తారు. ఈ ఆవులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది.


1868లోనే ఒంగోలు మేలు జాతి ఆవుల జంటను బ్రెజిల్‌కు తరలించారు. నాటి నుంచి ఈ జాతి ఆవుల వృద్ధికి ఆ దేశం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ దేశంలో ఈ జాతి ఆవులు నేటికి 16 మిలియన్ల వరకు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ దేశంలో 80 శాతం ఆవులు ఈ జాతివే కావడం గమనార్హం. అత్యధిక ఉష్ణోగ్రతలకు సైతం తట్టుకొని పెరగడం.. జీవక్రియ సమర్థవంతంగా జరుగుతుండడం.. అంటువ్యాధులకు తట్టుకొని ఉండడం.. అంటే వ్యాధి నిరోధకతను బాగా కలిగి ఉండడం ఈ జాతి ఆవుల ప్రత్యేకతలుగా ఉన్నాయి.


దీంతో ఈ ఆవులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. ఆ క్రమంలోనే బ్రెజిల్‌లోని పశువుల పెంపకందారులు సైతం ఈ జాతి ఆవులను కొనుగోలు చేసేందుకు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జాతి ఆవు శాస్త్రీయనామం ‘బాస్ ఇండికస్’. తెలుపు రంగులో ఉండి.. చూడడానికి చాలా బలిష్టంగా కనిపించడం ఈ జాతి ఆవుల ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో మేలు జాతి ఆవులకు ప్రసిద్ధి.

Updated Date - Mar 27 , 2024 | 06:34 PM