Share News

Parachute Failed: సాయం కోసం పంపిన పారాచ్యూట్ విఫలమై ఐదుగురు మృతి

ABN , Publish Date - Mar 09 , 2024 | 08:07 AM

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి(Israel Hamas war) గాజా పౌరులు(gaza people) అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడి వారని ఆదుకునేందుకు పలు దేశాలు సహా ఐరాస రిలీఫ్ ప్యాకేజీలను పంపిస్తుంది. కానీ తాజాగా పంపించిన ప్యాకేజీ కూడా పలువురి పాలిట విషాదంగా మారింది.

 Parachute Failed: సాయం కోసం పంపిన పారాచ్యూట్ విఫలమై ఐదుగురు మృతి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి(Israel Hamas war) గాజా పౌరులు(gaza people) అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడి వారని ఆదుకునేందుకు పలు దేశాలు సహా ఐరాస రిలీఫ్ ప్యాకేజీలను పంపిస్తుంది. కానీ తాజాగా పంపించిన ప్యాకేజీ కూడా పలువురి పాలిట విషాదంగా మారింది. పారాచ్యూట్(Parachute) ద్వారా ప్యాకేజీలను పంపించగా ఆ ఆహారం కోసం బారులు తీరిన పౌరులపై అది తెరుచుకోకుండా(failed) వచ్చి ఆకస్మాత్తుగా పడింది. దీంతో ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: China Unemployment: చైనాలో పెరిగిన నిరుద్యోగం.. చెక్ పెట్టేందుకు వినూత్న పద్ధతి


ఈ ఘటనపై గాజా ప్రభుత్వ మీడియా స్పందించింది. ఎయిర్‌డ్రాప్‌లు పనికిరానివిగా ఉన్నాయని తెలిపింది. అంతేకాదు ఎయిర్‌డ్రాప్‌లు(air drops) కేవలం ప్రచారం కోసమేనని, మానవతా సేవ కాదని వ్యాఖ్యానించింది. దీంతో పాటు భూ సరిహద్దు ద్వారా ఆహారం, ఇతర సామగ్రిని అందించాలని విజ్ఞప్తి చేసింది. దీని వల్ల గాజా పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండదని వెల్లడించింది.

అదే సమయంలో పౌరుల ప్రాణాలను తీసిన ఎయిర్‌డ్రాప్‌ అమెరికా వదిలిందని కొన్ని నివేదికలు చెబుతుండగా.. దీనిని అమెరికా(america) ఖండించింది. ఎయిర్‌డ్రాప్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే గాజాలో ప్రతి నలుగురిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారని UN ఆఫీస్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ గత నెలలో తెలిపింది. గాజా(gaza)లోని పలు ప్రాంతాలకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జనవరి 23 నుంచి ఆహారం పంపిణీ చేస్తున్నాయి.

Updated Date - Mar 09 , 2024 | 12:27 PM