Share News

Kim jong un: ఉత్తర, దక్షిణ కొరియా మధ్య యుద్ధం..కిమ్ ఆదేశాలు?

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:16 PM

ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ యుద్ధానికి సిద్ధం కావాలని తన దేశ సైన్యానికి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

Kim jong un: ఉత్తర, దక్షిణ కొరియా మధ్య యుద్ధం..కిమ్ ఆదేశాలు?

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియాతో యుద్ధం నివారించడం కష్టమని DPRK నాయకుడు కిమ్ జోంగ్ ఉన్(kim jong wan) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా వ్యాప్తంగా అణు, ఆయుధ ఉత్పత్తిని పెంచాలని, యుద్ధానికి సిద్ధం కావాలని వివిధ నేతలకు కిమ్ జోంగ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.


ప్రధాన ఆయుధాల కర్మాగారాలను తనిఖీ చేసేందుకు వచ్చిన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 80 ఏళ్లుగా మన పాలన, సామాజిక వ్యవస్థను కూలదోయడానికి దక్షిణ కొరియా ఘర్షణ చరిత్రను అనుసరిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మార్చలేని వాస్తవాన్ని గుర్తించాలని చారిత్రక సమస్యను సరిగ్గా పరిష్కరించాలని సుప్రీం నాయకుడు అన్నారు. ఈ క్రమంలో కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా ప్రకటించారు.

ప్రధానంగా ఉత్తర కొరియా తన మొట్టమొదటి గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత దక్షిణ కొరియాతో దాని సైనిక ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతోపాటు ఇటీవల దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలోని ద్వీపాలు యోన్‌పియోంగ్, బేంగ్‌నియోంగ్‌లను ఖాళీ విషయంలో కూడా వివాదం కొనసాగుతుంది.

Updated Date - Jan 10 , 2024 | 02:16 PM