Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Nikki Haley: ట్రంప్‌పై నిక్కీ హేలీ తొలి విజయం.. రివేంజ్ తీర్చుకున్నారా?

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:25 AM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున నిక్కీ హేలీ తొలి విజయాన్ని నమోదు చేశారు. హేలీ గతవారం ట్రంప్ చేతిలో ఓటమి పాలు కాగా ఇప్పుడు మొదటి విజయం సాధించి రికార్డు సృష్టించారు.

Nikki Haley: ట్రంప్‌పై నిక్కీ హేలీ తొలి విజయం.. రివేంజ్ తీర్చుకున్నారా?

అగ్రరాజ్యం అమెరికా(america) అధ్యక్ష ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్(Republican) పార్టీ తరఫున భారత సంతతి నేత నిక్కీ హేలీ(Nikki Haley) తొలి విజయాన్ని నమోదు చేశారు. ఆదివారం కొలంబియాలో జరిగిన ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి నిక్కీ హేలీ రికార్డు సృష్టించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మంగళవారం జరిగే ప్రాథమిక ఎన్నికలపై ఉంది. ఇందులో కూడా నిక్కీ హేలీకి చాలా మంది ప్రతినిధుల మద్దతు లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. అంతేకాదు అమెరికా చరిత్రలోనే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా నిక్కీ హేలీ ఘనతను సాధించారు.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Pakistan PM: వీడిన మిస్టరీ.. పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్


అయితే గత వారం వరకు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో(primary elections 2024) డొనాల్డ్ ట్రంప్(donald trump) ఏకపక్షంగా గెలుస్తూ వచ్చారు. కానీ కొలంబియాలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం 16 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనుండగా ట్రంప్, నిక్కీ హేలీల మధ్య పోటీ ఎలా ఉంటుందో మంగళవారం వచ్చే ఫలితాల్లో తేలనుంది. అనేక పరాజయాలు ఎదురైనప్పటికీ నిక్కీ హేలీ అధ్యక్ష ఎన్నికల బిడ్ నుంచి వైదొలగడానికి నిరాకరించారు.

శనివారం రోజు డోనాల్డ్ ట్రంప్(donald trump) మిస్సౌరీ, ఇడాహో, మిచిగాన్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. ట్రంప్‌కు 244 మంది డెలిగేట్ల మద్దతు లభించగా, ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వానికి 1215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. కాగా నిక్కీ హేలీకి 24 మంది డెలిగేట్ల మద్దతు లభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024(us president elections 2024) నవంబర్ మొదటి వారంలో జరగనున్నాయి. నాలుగేళ్ల కాలానికి జరిగే ఈ ఎన్నికల్లో ఓటర్లు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

Updated Date - Mar 04 , 2024 | 10:25 AM