Share News

Remal Cyclone: బంగ్లాదేశ్‌లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ABN , Publish Date - May 26 , 2024 | 06:27 PM

రెమల్ తుపాన్ బంగ్లాదేశ్ వైపు దూసుకు వస్తుంది. ఆదివారం సాయంత్రం, అర్థరాత్రి మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాన్ తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు సంభవించనున్నాయని ఆ దేశ వాతావరణ విభాగం వెల్లడించింది.

Remal Cyclone:  బంగ్లాదేశ్‌లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఢాకా, మే 26: రెమల్ తుపాన్ బంగ్లాదేశ్ వైపు దూసుకు వస్తుంది. ఆదివారం సాయంత్రం, అర్థరాత్రి మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాన్ తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు సంభవించనున్నాయని ఆ దేశ వాతావరణ విభాగం వెల్లడించింది. దాంతో దేశంలోని కోస్తా జిల్లాలు, నౌకశ్రాయాల వద్ద 10 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

Jammu Kashmir: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు..!


ఈ నేపథ్యంలో ఆ దేశ విపత్తు నిర్వహణ శాఖ సహాయ మంత్రి మహ్మద్ మహిబుర్ రెహ్మన్ మాట్లాడుతూ.. 10 జిల్లాలోని 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. అందుకోసం నేవి, కోస్ట్ గార్డ్, పోలీసులు, పలు స్వఛ్చంద సంస్థలతోపాటు వివిధ రాజకీయ పార్టీల సహాయ సహకారాలు తీసుకున్నట్లు వివరించారు. ఈ తుపాన్ కారణంగా తీర ప్రాంత జిల్లాలను వరదలు మంచెత్తుతున్నాయన్నారు.

AP Elections: సీఎస్ జవహర్ నిరూపిస్తే.. కాళ్లు పట్టుకుంటా!


అలాగే పలు నౌకాశ్రయాల్లోని నౌకలను నిలిపివేసినట్లు చెప్పారు. ఇక చట్టోగ్రామ్‌లోని షా అమానత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను 8 గంటల పాటు నిలిపి వేసినట్లు తెలిపారు. ఇక 2007లో సంభవించిన సిదిర్ తుపాన్ కారణంగా 4 వేల మందికిపైగా మృతి చెందగా.. పలువురు గల్లంతైన విషయం విధితమే.

Telangana: ఇది రింగ్ కాక మరేమిటి..?

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 06:38 PM