Share News

India-Pakistan: మళ్లీ అదే పాత రికార్డ్.. అయోధ్య, సీఏఏ ప్రస్తావనలపై పాకిస్తాన్‌ని ఎండగట్టిన భారత్

ABN , Publish Date - Mar 16 , 2024 | 07:46 PM

తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్‌పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది.

India-Pakistan: మళ్లీ అదే పాత రికార్డ్.. అయోధ్య, సీఏఏ ప్రస్తావనలపై పాకిస్తాన్‌ని ఎండగట్టిన భారత్

తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) పాటు మరెన్నో సమస్యల పరిష్కారంపై పాకిస్తాన్ (Pakistan) దృష్టి పెట్టకుండా.. భారత్‌పై (India) అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై అవమానపరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ.. పాక్ పన్నుతున్న వ్యూహాలు ప్రతిసారి బెడిసికొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ దాయాది దేశం వేసిన ఎత్తుగడ బోల్తా కొట్టేసింది. అయోధ్య, సీఏఏ అంశాలను ప్రస్తావించి.. భారత్ చేతిలో అభాసుపాలయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


శుక్రవారం ఐరాస జనరల్ అసెంబ్లీ(UNGA)లో ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ అంబాసిడర్ మునిర్‌ అక్రమ్ (Munir Akram) మాట్లాడుతూ.. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ (Ram Lalla Pran Pratishtha), రీసెంట్‌గా అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) (Citizenship Amendment Act) గురించి ప్రస్తావించారు. దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ (Ruchira Kamboj) స్పందిస్తూ.. భారత్‌కు సంబంధించిన విషయాలపై ఈ (పాక్) ప్రతినిధి బృందం సంకుచిత, తప్పుదోవ పట్టించే దృక్ఫథాన్ని కలిగి ఉండటం నిజంగా దురదృష్టకరమని మండిపడ్డారు. ఈ జనరల్‌ అసెంబ్లీ మొత్తం సభ్యుల నుంచి వివేకం, ప్రపంచ దృక్పథం, ఇతర లోతైన అంశాల గురించి గురించి కోరుతుంటే.. పాక్ బృందం నుంచి మాత్రం భిన్నమైన వైఖరి కనిపిస్తోందంటూ దుయ్యబట్టారు. ఒకవైపు ప్రపంచం పురోగమిస్తుంటే.. మరోవైపు పాక్ ప్రతినిధి బృందం స్తబ్ధుగా ఉండటం విచారకరమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలావుండగా.. కొన్ని రోజుల క్రితం కూడా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో దాయాది దేశం జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా.. అందుకు భారత్ గట్టి బుద్ధి చెప్పింది. ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయని నిప్పులు చెరిగిన భారత్.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆ దేశానికి లేదని హెచ్చరించింది. భారత్‌పై అసత్య ఆరోపణలు చేసేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని, ఇది నిజంగా దురదృష్టకరమని మండిపడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి సొంత ప్రజల కష్టాలు తీర్చడంలో విఫలమైన పాక్ లాంటి దేశం చేసే ఆరోపణలపై తాము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 16 , 2024 | 07:46 PM