Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Donald Trump: డోనాల్డ్ ట్రంప్ జోరు.. మరో మూడు రాష్ట్రాల్లో కూడా నిక్కీ హేలీని..

ABN , Publish Date - Mar 03 , 2024 | 08:07 AM

అమెరికా(america) అధ్యక్ష ఎన్నికల నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్(donald Trump) ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ట్రంప్ మరో 3 రాష్ట్రాలలో ప్రత్యర్థి నిక్కీ హేలి(nikki haley)ని ఈజీగా ఓడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Donald Trump: డోనాల్డ్ ట్రంప్ జోరు.. మరో మూడు రాష్ట్రాల్లో కూడా నిక్కీ హేలీని..

అమెరికా(america) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(donald Trump) అధ్యక్ష ఎన్నికల నామినేషన్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటివల ఆమె సొంత స్థానంలో నిక్కీ హేలీ(nikki haley)ని ఓడించిన తర్వాత, రిపబ్లికన్ పార్టీ(Republican) తరఫున డొనాల్డ్ ట్రంప్ తాజాగా శనివారం మరో మూడు రాష్ట్రాలలో ప్రత్యర్థి నిక్కీ హేలిని సులభంగా ఓడించారు. వాటిలో మిచిగాన్(Michigan), ఇడాహో(Idaho), మిస్సౌరీ(Missouri) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ దాదాపు 98% అంటే 1575 ఓట్లతో గెలుపొందగా, నిక్కీ హేలీకి కేవలం 36 ఓట్లు మాత్రమే వచ్చాయి.

స్టేట్ రిపబ్లికన్ పార్టీ(Republican caucuses) ప్రకారం ట్రంప్ మిచిగాన్‌లో నామినేషన్ కౌకస్‌లో పాల్గొన్నారు. మిచిగాన్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఛైర్మన్ పీట్ హోయెక్స్ట్రా దీనిని 'అద్భుతమైన, ఆకట్టుకునే' విజయమని పేర్కొన్నారు. ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్(donald Trump) అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మిచిగాన్, మిస్సౌరీ, ఇడాహోలో విజయాలతో అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్నారు. దీంతో ప్రెసిడెంట్ నామినేషన్ రేసులో నిక్కీ హేలీకి వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. తన మద్దతును కూడగట్టుకోవడంలో ఆమె విఫలమవుతోంది. ఈ క్రమంలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ జో బైడెన్(joe biden) మధ్య గట్టి పోటీ ఉండనుంది.


రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుత USA అధ్యక్షుడు జో బైడెన్(joe biden) ప్రజాదరణ క్రమంగా క్షీణిస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే ప్రకారం జో బైడెన్ పని పనితీరుకు 47% మాత్రమే ఆమోదం లభించింది. దేశం సరైన దిశలో పయనిస్తోందని నలుగురిలో ఒకరు (24%) మాత్రమే భావిస్తున్నారని సర్వే పేర్కొంది. మిగిలిన ముగ్గురు వ్యక్తులు జో బైడెన్ విధానాలు దేశానికి హాని కలిగించాయని భావిస్తున్నారు. ఈ క్రమంలలో వచ్చే ఎన్నికల్లో బైడెన్ గెలుపు కష్టమేనని చెప్పవచ్చు. మరి మళ్లీ ట్రంప్‌కు పట్టం కడతారా లేదా అనేది వేచి చూడాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కన్నీరు పెట్టుకున్న ముఖేష్ అంబానీ

Updated Date - Mar 03 , 2024 | 08:07 AM