Share News

Hindu Temple Open: అబుదాబి హిందూ ఆలయంలో భక్తుల దర్శనం షురూ..రద్దీ ఎలా ఉందంటే

ABN , Publish Date - Mar 02 , 2024 | 06:52 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం శుక్రవారం సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.

Hindu Temple Open: అబుదాబి హిందూ ఆలయంలో భక్తుల దర్శనం షురూ..రద్దీ ఎలా ఉందంటే

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని(Hindu Temple)శుక్రవారం సాధారణ ప్రజల(general public) కోసం తెరిచారు. ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం తెరిచి ఉంటుందని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) తెలిపింది. ఈ ఆలయాన్ని BAPS 27 ఎకరాలలో సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మించగా.. ఆలయం కోసం భూమిని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది.

ఆలయం ప్రారంభం నేపథ్యంలో భక్తులు(devotees) పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లైన జంట వారి వివాహం అయిన మొదటి రోజున ఆలయానికి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడికి వచ్చి భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాదు ఆలయ వాస్తుశిల్పం అపురూపంగా ఉందన్నారు. అబుదాబిలోని BAPS దేవాలయం మధ్యప్రాచ్యంలో మొదటి సాంప్రదాయ హిందూ దేవాలయం. ఇది భారతదేశం, UAE మధ్య బలమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక సమ్మేళనం, మతాల మధ్య సామరస్యం, సహకారం స్ఫూర్తిని సూచిస్తుంది.


ఈ సందర్భంగా యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ భారత్-యూఏఈ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. భారత్-యూఏఈ సంబంధాలను ఉద్ఘాటిస్తూ యూఏఈలో ప్రధాని మోడీ పర్యటనలను గుర్తు చేసుకున్నారు. గత 9-10 ఏళ్లలో ప్రధాని మోదీ(narendra modi) ఈ దేశానికి ఏడుసార్లు రాగా, రెండేళ్లలో నాలుగుసార్లు ఇక్కడికి వచ్చారని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ప్రధాని మోదీ చివరి పర్యటన చాలా ముఖ్యమైనదని భారత రాయబారి చెప్పారు. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. UAEలో ప్రస్తుతం 3.5 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు ఉన్నారు. ఈ క్రమంలో వీరంతా మరికొన్ని రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించుకోనున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Pro Kabaddi: ప్రొ కబడ్డీ నయా చాంప్‌ పుణెరి పల్టన్‌.. ఉత్కంఠ ఫైనల్లో హరియాణాపై గెలుపు

Updated Date - Mar 02 , 2024 | 06:54 AM