Share News

Landslides: చైనాలో కొండచరియలు విరిగిపడి.. 47 మంది మృతి

ABN , Publish Date - Jan 22 , 2024 | 11:24 AM

చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్‌ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది మృత్యువాత చెందారు.

Landslides: చైనాలో కొండచరియలు విరిగిపడి.. 47 మంది మృతి

చైనా(china)లోని పర్వత ప్రాంతమైన యునాన్‌ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది మృత్యువాత చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే 200 మందిని రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన చైనాలోని నైరుతి ప్రావిన్స్‌లోని యునాన్‌లో జరిగింది. యున్నాన్‌లోని లియాంగ్‌సుయ్ గ్రామంలో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.


మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి: Ram Mandir: కాసేపట్లో ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్యపై పూల వర్షం..30 మంది కళాకారులతో సంగీత ప్రదర్శన

ప్రమాదం జరిగిన ప్రాంతం జెన్‌జియాంగ్ కౌంటీలోని టాంగ్‌ఫాంగ్ నగరం పరిధిలో ఉంది. కొండచరియలు విరిగిపడటంతో 18 ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయినట్లు సమాచారం. ప్రభావిత ప్రాంతం నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Updated Date - Jan 22 , 2024 | 11:48 AM