Share News

Women's Health: మీరు 30, 40 ఏళ్లు నిండిన మహిళలా? అయితే ఈ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలట..!

ABN , Publish Date - May 25 , 2024 | 01:54 PM

30 ఏళ్ల తర్వాత మహిళలు శారరీకంగా చాలా మార్పులకు లోనవుతారు. పెళ్లి, పిల్లలు, గృహిణిగా ఒత్తిడులు, శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు 30 ఏళ్ల తరువాత ఎక్కువగా ఉంటే.. 40 ఏళ్ల తరువాత మెనోపాజ్ కు దగ్గరవుతూ మరిన్ని సమస్యలు ఎదుర్కుంటారు. ఇన్ని ఎదురవుతున్నా మహిళల ఆరోగ్యం బాగుండాలంటే.. వారి 30, 40 ఏళ్ల వయసులో కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.

Women's Health: మీరు 30, 40 ఏళ్లు నిండిన మహిళలా? అయితే ఈ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలట..!

మహిళల ఆరోగ్యం చాలా సున్నితమైనది. మహిళల జీవితంలో ప్రతి దశలోనూ ఆరోగ్యపరంగానూ, శారీరకంగానూ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు శారరీకంగా చాలా మార్పులకు లోనవుతారు. పెళ్లి, పిల్లలు, గృహిణిగా ఒత్తిడులు, శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు 30 ఏళ్ల తరువాత ఎక్కువగా ఉంటే.. 40 ఏళ్ల తరువాత మెనోపాజ్ కు దగ్గరవుతూ మరిన్ని సమస్యలు ఎదుర్కుంటారు. ఇన్ని ఎదురవుతున్నా మహిళల ఆరోగ్యం బాగుండాలంటే.. వారి 30, 40 ఏళ్ల వయసులో కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అవేంటో తెలుసుకుంటే..

పాప్ స్మియర్, హెచ్‌పివి టెస్ట్..

30ఏళ్ల మహిళలు అందరూ పాప్ స్మియర్ హెచ్‌పివి టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించడం సులువు అవుతుంది.

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!


సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్..

30ఏళ్ల లోపు మహిళలు 3-4 నెలలకు ఒకసారి తమ పీరియడ్స్ తరువాత చంక ప్రాంతంలో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి.

మామోగ్రామ్‌లు..

40 సంవత్సరాల తరువాత రొమ్ము క్యాన్సర్ పరీక్ష కోసం మామోగ్రామ్ లు చేయించుకోవాలి. కుటంహంలో ఎవరికైనా ముందే రొమ్ము క్యాన్సర్ ఉండి ఉంటే ఇలాంటి వారు ఇంకా ముందుగా పరీక్ష చేయించుకోవాలి.

బోన్ డెన్సిటీ టెస్ట్..

30, 40 ఏళ్ల చివర్లో ఉన్న మహిళలు ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి.

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!


బీపీ, కొలెస్ట్రాల్..

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు చాలా సహాయపడతాయి.

బ్లడ్ గ్లూకోజ్..

ఊబకాయం ఉన్నవారు, కుటుంబంలో ముందే మధుమేహం బారిన పడినవారు ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలి.

పెద్ద ప్రేగు క్యాన్సర్..

45 సంవత్సరాల వయసు నుండి మహిళలు ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపి, కోలనోస్కోపీ వంటి పరీక్షలతో పాటూ కొలోరెక్టల్ క్యాన్సర్ టెస్ట్ లు చేయించుకోవాలి.

వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!

ఖాళీ కడుపుతో పొరపాటున కూడా తినకూడని ఆహారాలు ఇవి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 25 , 2024 | 01:54 PM