Share News

Ultra Processed Food: ఈ ఆహారాలతో ఏకంగా 32వ్యాధులు వస్తాయా? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ గురించి షాకింగ్ నిజాలివీ..!

ABN , Publish Date - Mar 02 , 2024 | 01:45 PM

అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ గురించి పరిశోధనల్లో వెల్లడైన నిజాలు ఇవీ..

Ultra Processed Food:  ఈ ఆహారాలతో ఏకంగా 32వ్యాధులు వస్తాయా?  అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ గురించి షాకింగ్ నిజాలివీ..!

వేగవంతమైన ఈ కాలంలో ఆహరం విషయంలో కూడా చాలామంది వేగంగానే ఉంటారు. ఎవరికీ ఏదీ ఓపికగా చేసుకునే సమయం ఉండదు. పైపెచ్చు పాశ్చాత్య సంస్కృతి కారణంగా చాలామంది ఫాస్ట్ ఫుడ్ కు, రెడీ టూ ఈట్ ఫుడ్స్ కు అలవాటు పడిపోయారు. కార్బోనేటెడ్ పానీయాలు, చక్కెర శాతం అధికంగా ఉన్న ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తింటే ఏకంగా 32రకాల జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని అంటున్నారు ఆహార నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కార్బోనేటెడ్ పానీయాలు, బర్గర్లు, పిజ్జాలు, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ మొదలైనవి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ లో భాగంగా ఉంటాయి. వీటి తయారీలో శుద్ది చేసిన పిండి, కృత్రిమ రంగులు, ప్యాకింగ్ కోసం రసాయనాలు మొదలైనవి ఉపయోగిస్తారు. ఈ అల్ట్రాప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువగా తింటే కార్డియోవాస్క్యులర్ డిసీజ్ సమస్యలు పెరుగుతాయని, సాధారణం కంటే వీటి ప్రమాదం 48 నుండి 53 శాతం ఎక్కువ ఉంటుందని పరిశోధనలలో తేలింది. మరీ ముఖ్యంగా ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల మరణ ప్రమాదం 50 శాతం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే.. ఈ 7 పనులు చేయండి చాలు..!


అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల అకాల మరణం 21శాతం ఎక్కువగా ఉంటుంది. మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 40-66శాతం ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి సమస్యలు, నిరాశ వంటివి 22శాతం ఎక్కువ అవుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్యవార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 01:45 PM